Others

నాకు నచ్చిన పాట--శ్రీరస్తు.. శుభమస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1991లో విడుదలైన ‘పెళ్ళి పుస్తకం’ చిత్రానికి ఆరుద్ర కలంనుండి జాలువారిన అద్భుత గీతం- శ్రీరస్తూ శుభమస్తూ. ఈ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకూ పెళ్ళిపీటల మీదనున్న వధూవరులకు వినిపించే సందేశ గీతమిది. ముఖ్యంగా కొత్త పెళ్ళికూతురుకి కొన్ని సూచనలివ్వబడ్డాయి. ‘శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం’- అంటే ఇద్దరిమధ్యా వివాహ బంధం ఏర్పడిందని. ‘ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’- అంటే నూతన జీవితం అంతా భాగస్వామితో గడపాలని. అతడు ‘తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టినా/ తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా- అంటూ వధువు తలమీద జీలకర్ర, బెల్లం మిశ్రమం పెట్టి తదుపరి మంగళ సూత్రధారణ చేసి నిన్ను శాశ్వత సుమంగళిగా దీవిస్తున్నానని తలమీద ఒట్టుపెడుతూ ఏడడుగులు అగ్ని ప్రదక్షణం చేస్తూ-ఇదే ఈ వివాహ మంత్రానికి అర్ధం మరమార్ధం అని వివరించాడు కవి ఆరుద్ర. ఇంకొక మాటంటాడు. అమ్మా కొత్త పెళ్ళికూతురా- ప్రతి అడుగులోనూ తొలిసారి చేసిన వాగ్దానాలు గుర్తు చేసుకుంటూ- ప్రవర్తనలో చిన్న చిన్న లోపాలుంటే వాటిని వెంటనే సరిదిద్దుకుని, భర్తతో అనురాగాన్ని, ఆప్యాయతను పంచుకుని జీవితమంతా నిండు పున్నమిలా కలకలా, తళతళా జీవించమని ఆరుద్రగారి ఆశీర్వచనం. చిన్న మాటలతో పెద్ద విషయాలను మనకందించాడాయన. ఈ పాటంటే ఇష్టపడని వారుంటారా?
***

వెనె్నల రచయితలకు
సూచన
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.
మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్