Others

మనోదృష్టికి లేదు ఆటంకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారే కుకవులు వారేరీ ఈరోజు
కాట్లాడుకొని పోయినోళ్లే
కారణము రససిద్ధి పొందని క్రోధులు
శబ్దాలంకారబాధితులు పరమ మాత్సర్యగ్రస్తులు
ఏ జన్మ తప్ఫఃలమో శారద కనికరించి కరాగ్రమున
కనమీయ శరత్కాల చంద్ర వదనంతో నృత్యము చేసినా
కనుల జూడలేని మందభాగులు
మాటలు తమ సొత్తే అన్న అహంభావులు
వారు రాసిన కైతలు వారే తీసికొని వెళ్లిన వాచాలురు
కాటికి కానుకగ పోయి నోళ్లు ‘‘ఆనవాళ్లు లేని వాళ్లు’’
అలాగే ఎందరో మహాకవులు వ్రాసిన గ్రంథాలు ఆచంద్ర తారార్కము పరిఢవిల్లుతున్నాయి. వారే వ్యాస మహర్షి, వాల్మీకి, కాళిదాసు, దండి, భవభూతి, మొదలగువారు. ఆంధ్ర వాఙ్మయములో కవిత్రయము , పోతన, రాయల కొలువులోని అష్టదిగ్గజాలు మరెందరో భారత సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు.
వారు ఈ భౌతిక ప్రపంచంలో లేకున్న రససిద్ధులు, అకురులు, శబ్దాలను ఇముడ్చుకున్నది ఆకసము. భూమిపైన 12 రీౄ దాటినాంక ‘నాదము’ ఉండదు. దీనిని ‘డఆ్ఘఆ్యఒఔ్దళూళ’ అంటారు. అదే అంతరంగంలో పరిధి అపరిమితము. అంతరంగ ప్రయాణంలో కుండలినీ ఊర్థ్వముఖ ప్రయాణంలో భేరీ నాదాలు, శంఖనాదాలు, ఘంటానాదాలు, అనాహత శబ్దాలు, షట్చక్రచేదన జరిగితే మంత్ర శబ్ధాలు వినవచ్చు. కవి ప్రకృతిలోని అందాలు ఒదిసి పట్తే, యోగ అంతర్మధనం చేసి శబ్దానందాన్ని పొందుతాడు.
‘రవి కానని చో కవి గాంచు నెయ్యెడన్’ భావనా ప్రకంపనల తీవ్రత ఆగిన చోట భాష ముద్దు మాటలతో జత కలిసి చట్టాపట్డాలు వేసుకొని తాదాత్మ్యస్థితి తీసికొని వెళుతుంది. వ్యాకరణాలు, సంధులు, భావప్రకంపనల వేగానికి కరకట్టవేసినా, వాటి మధ్యలో సేదతీర్చుకుని దిశమార్చుకొని నూత్న పోకడలతో గమ్యం చేరుతుంది. సుకవి భావావేశాన్ని ఏకైవారము ఆపలేదు. కవితకు భాషాడంబరము, భావాడంబరము ఉండవచ్చు. అసలైన రససిద్ధి లేకున్న అది చూచు వారుండరు. ఆ స్రిన కవి తప్ప. సినారె కవి వ్రాసినట్టు ‘అవధి లేని ప్రతిఅనుభూతికి ఆత్మానందమే పరమార్థము. రమణీయ కళావిష్కుృతికి రసానందమే పరమార్థం’’ ఇక కవితకు ఆయుర్దాయము నిర్ణయించుట జనుల చేతులోనిది. సంధికొట్టేవి.శాశ్వతంగా రససిద్ధి పొందిన కవితలు కాలానికి ఎదురొడ్డి నిలుస్తాయి.

- కె. రఘునాథ్, 9912190466