Others

వందే కృష్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగంలో వర్షాలు రాకపోతే వరుణ యాగాలు చేస్తారు. వరుణిడికి పూజలు చేస్తారు. కానీ గోకులంలో చిన్నకృష్ణుడు ఉన్న సమయంలో గోపాలులందరూ ఇంద్రుని ప్రీతి కోసం యాగాలు చేద్దాం అనుకొన్నాఠు. వారు ప్రతి సంవత్సరమూ ఇంద్రుని ప్రీతికోసం యాగాలు చేసేవారు. ఇంద్రుని ప్రీతి చెందితే వరుణుడిని పంపిస్తాడని వారి నమ్మకం. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గోపాలుడే వచ్చి మనలను రక్షించేది వర్షాలను ఇచ్చేది పర్వతాలు కానీ ఇంద్రుడు కాదుకదా. పర్వతాలను ఏనాడైనా పూజించామా మనం. ఈసారి గోవర్థన గిరిని పూజిద్దాం అని చెప్పాడు.
కృష్ణుడి మాటలు విని గోపాలురం దరూ గోవర్థనగిరిని పూజించారు. దీన్ని చూసి న ఇంద్రుడి ఎక్కడలేని కోపం వచ్చింది. నన్ను కాదని పర్వత పూజ చేస్తారాఅనుకొని వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. దానికి వారు భయ
పడకపోయేసరికి వారిపైన ఏకధాటిగా వారం పాటు వడగండ్ల వాన కురిపించాడు. గోకులంతా వారంతా భయపడి కృష్ణుడి దగ్గరకు వెళ్లారు. వారినంతా కృష్ణుడు ఓదార్చి మరేంఫర్లేదు అని చెప్పి గోవర్థన గిరిని తన చిటికెన వేలుతో ఎత్తి గొడ్డు గోదాతో కలసి అందరినీ ఆ గిరి కిందకు రండి అని చెప్పాడట. అంతే గోకులం యావత్తు గోవర్థన గిరికిందకి చేరింది. వారిని ఇంద్రుడు ఏమీ చేయలేకపోయాడు. ఇంద్రుని అజ్ఞానాన్ని బ్రహ్మ పారద్రోలి కృష్ణుడంటే గోపాలుడు మాత్రమే అను కొన్నావా ఇంద్రా అతడే సర్వేశ్వరుడు సర్వసృష్టికి కారణుడైన పరమాత్మ అతనే అని చెప్పగా తన అజ్ఞానాన్ని దూరం చేసుకొని కృష్ణుడిని దగ్గరకు పరుగెత్తుకు వచ్చి స్వామీ కృష్ణా నన్ను మన్నించు. కాపాడు అంటూ వేడుకున్నాడు. వడగండ్ల వాన దూరం అయంది. గోకులం అంతా ఎవరిండ్లకు వారు చేరు కొన్నారు. అందరూ కృష్ణుడు తమను కాపాడాడని గోవిందా గోవిందా అని కీర్తించారు. బ్రహ్మ , ఇంద్రుడు మొదలైన వారంతా వచ్చి కృష్ణుని పాదాలు కడిగి వారి తలపై చల్లుకొని కృష్ణా ఆపద్భాందవా నీవే మా దిక్కు అని మొరలిడారు. కలియుగంలోను ఏ ఆపదా వచ్చినా కృష్ణా అని ఆర్తితో పిలిస్తేచాలు కృష్ణుడు ఆఘమేఘాల మీద కదలి వచ్చి ఆ ఆపత్తు దూరం చేసేస్తాడు. అందుకే కృష్ణునిజయంతిరోజున అపుడే పుట్టినట్టు కృష్ణునికి సర్వోపచారాలు చేస్తారు. వూయల్లో పరుండబెట్టి వూయలు వూగిస్తూ కృష్ణుడు చేసిన సర్వ రక్షణలను కమ్మగా పాడుకుంటారు. ఆయన జీవితంలో సంహరిం చిన రాక్షసులగురించికృష్ణకృపను పొందినవారి గురించి కథలుగా చెప్పుకుంటారు.
కృష్ణుడికి గోవులంటే ప్రీతి, ప్రేమ. వాటి కాపరిగా ఉండటం చేత గోవిందా గోవిందా అని పిలిచేవారుకృష్ణ్భక్తులు. కలికాలంలో కలినుంచి తప్పించుకోవడానికి కృష్ణుని శరణు పొందితే చాలు కృష్ణ కథలను రోజు వింటే చాలు. హరే కృష్ణా హరే కృష్ణా హరే రామా హరే రామా అని పలుకుతుంటే చాలు కలి పురుషుడు కృష్ణ్భక్తులకు ఆమడ దూరంలో ఉంటాడు. కనుక అందరూ కృష్ణ నామంలో పునీతులం అవుదాం రండి. కృష్ణా అని నోరారా పిలుస్తూ సర్వంలోను కృష్ణఅంశను చూద్దాం.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి