Others

జీవన శిల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ జీవన శిల్పానికి
నీవే ఒక శిల్పివై
మార్చుకొనుము
కూర్చుకొనుము
నేర్చుకొనుము
నవ జీవన విధానమును
పొద్దు పొడుపు పొడవగనే
బద్ధకాన్ని వదిలిపెట్టి
నిదురలేచి నిశ్చయముగ
నడకను ప్రారంభించుము
అల్పాహారముతోనే
ఆ రోజును మొదలుపెట్టి
అంతులేని ఆరోగ్యం..
పొందుమింక ప్రతిరోజూ
యోగా-్ధ్యనము విడిచి
సాగదు మన జీవనమ్ము
ఆత్మశుద్ధి పొందుటకై
ఆధ్యాత్మికతను నమ్ము
తెలుసా! మన జీవిత నౌక
తెర చాపలు లేని నావ
మనసు దారి తప్పినచో
మరచిపోవు దాని త్రోవ
కలగానిది జీవితమని
కవి చెప్పిన మాట విని
కష్టించుము, సృష్టించుము
కమనీయమగు జీవన శిల్పమును
కృషి చేయుము, శృతి చేయుము
శ్రమ జీవన సౌందర్యమును..

- మరువాడ భానుమూర్తి 8008567895