Others

హే కృష్ణా! ముకుందా! మురారీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవకీ గర్భాన దేదీప్యమానవౌ
దీప్తుల వెదజల్లి తీవుకృష్ణ!
యమునమ్మ దారివ్వనల నందునింటను
ముద్దుగఁ బెరిగిన మువ్వ కృష్ణ!
వ్రేపల్లెలో నంత వివిధంబులైనట్టి
యల్లర్లు సృష్టించు నల్లకృష్ణ!
మేనమామంపంగ మ్రింగేయ వచ్చిన
బహు రాక్షసులఁ జంప బాలకృష్ణ !
పదునాల్గులోకాలు పట్టమ్ము గట్టిన ఁ
బశుల కాపరివె గోపాల కృష్ణ!
కులసతి వస్త్రాలు వలచు సందర్భాన ఁ
జూచి కాపాడు యశోదకృష్ణ !
అలకుచేలునిపట్ల యమితానురాగంబు
వర్షించి దయఁ జూపువాడ కృష్ణ!
పాండవ పక్షాన భాసిల్లు వాడవై
దుష్టుల నిర్జించు దొరవు కృష్ణ!
వివిధ సందర్భాల విజ్ఞాన సరణిలో
సకల సత్కార్యాలు సలుపు కృష ణ!
దుష్టశిక్షణ ధ్యేయమై శిష్టరక్ష
ణార్థమే లక్ష్యమై యిల నవతరించి
గుండె గుడులందుఁ జక్కంగఁ గొలువుదీరి
యేలుచున్నావు మమ్ము లోకాలఁ గృష్ణ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం.. 9492457262