Others

వేణువై వచ్చాను.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంభావ సరస్వతి వేటూరి సుందర రామమూర్తి రాసిన మంచి పాటల్లో ఒకటి చెప్పమని ఎవరినైనా అడిగితే -సమాధానం కరవవ్వడం కష్టం. ఎందుకంటే -ఆయన రాసిన వేలాది పాటల్లో ఒక మంచి పాట అని ఏరడమంటే కష్టమే. రాసిన పాటల్లో మంచి పాటలు, వాటిలో గొప్ప పాటలు, వాటిలో శ్రేష్ఠమైన పాటలు, వాటిలో... ఇలా ఫిల్టర్ చేసుకుంటేపోతే.. అంచుల్లో సైతం మిగిలే ఓ పాట -వేణువై వచ్చాన భువనానికి అన్నది. చిన్ని చిన్ని మాటలతో అనంతార్థాన్ని చెప్పిన మాట. వేణువై వచ్చాను భువనానికి/ గాలినై పోతాను గగనానికి/ మమతలన్నీ వౌనరాగం/ వాంఛలన్నీ వాయులీనం.. అంటూ నాలుగే నాలుగు ఫంక్తుల్లో గుండె బరువెక్కిస్తాడు. ఇక చరణంలో -ఏడు కొండలకైన బండతానొక్కటే/ ఏడు జన్మల తీపి ఈ బంధమే/ నీ కంటిలో నలక లో వెలుగు నే కనక/ మేను నేననుకుంటే ఎద చీకటే.. హరీ../ రాయినై ఉన్నాను ఈనాటికీ/ రామ పాదము రాక ఏనాటికీ.. అన్న చిత్రమ్మ గొంతులో వేటూరి మాటలు వింటుంటే ఏడుపు రాకుండా ఉంటుందా? రెండో చరణంలో నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె/ నిప్పు నిప్పుగ మారె నా గుండెలో/ ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు/ పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు.. హరీ.. రెప్పనై ఉన్నాను మీ కంటికి/ పాపనై వస్తాను మీ ఇంటికి..
ఈ పాట విన్న తరువాత -తెలుగు పాటను ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టిన గొప్ప కవుల్లో వేటూరి పేరు చేర్చకుండా ఉండగలమా? కె అజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాతృదేవోభవ చిత్రంలోనిదీ పాట. డెన్నిస్ జోసెఫ్ అందించిన కథ ఒక ఎత్తు. ఈ ఒక్క పాటా ఒకెత్తు. పాటకు తగిన బాణీతో కీరవాణి ప్రాణం పోస్తే, చోటా కె నాయుడు తన కెమెరాతో సినిమాను శాశ్వతం చేశాడు. నాజర్, మాధవి, చారుహసన్‌లాంటి గొప్ప ఆర్టిస్టులు -మాతృదేవోభవ చిత్రానికి మరోప్రాణం. అంత గొప్ప చిత్రానికి నిర్మాత అయిన కెఎస్ రామారావును అభినందించాలి. ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం.

-జి మమత, పెద్దాపురం