Others

సృస్థిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిత్యాగంలో ఉదయించే అందంగా
నా కోర్కెల శిఖరానె్నక్కిన దేవాలయమై
కనిపించిందివాళ
స్వేద పరిమళాల్లో ముఖరిస్తున్న శ్రామిక నాదం
ఎన్ని పూప
రాగాల్ని వినిపిస్తోందో..!
వౌనంగా వున్నంత మాత్రాన
చెట్టు మాట్లాడదనుకుంటే అది అవిద్యే
తపశ్శక్తితో తరళ సౌందర్యాన్ని
ఋతువుకందిస్తుంది
గాలి పెదవులు మెల్లిగా సోకితే
నిద్రలో గూడ
పూలు నవ్వుతాయి
రెమ్మలతో వెనె్నలకు రంగుల్ని చిత్రిస్తుంది
దుఃఖాన్ని రేకులద్దుతుంది
ఆశల పల్లవుల్ని ఆమని దాకా మోస్తుంది
అంతరంగానికి అసలు విషయాన్ని చేర్చే
ఆకారాన్ని
సముద్రాలు దాటిస్తుంది
బీజగర్భం నుండి భూమి శరీరానికి పుట్టిన
తరు స్వప్న తరమంతా
పూజాగృహంలాంటి పూవులోనే వుంది..
ఇంకావుంది...