Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఆడవారిని వేధించెడల్పులారా!
పురుగులే మిన్న మీకన్నఁ బునె్నములకు
నెలవులవ్వారలెఱుగుమీ యిలఁ గనంగఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఆడవారిని నానా యాతనలకు గురి చేసే అల్పులారా!అధికంగా వేధించే మీ కన్నా పురుగులే మిన్న అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆడవారంటే ఆదిపరాశక్తి అని తెలుసుకోలేక అఘాయత్యాలకు పాల్పడుతున్నారు. ఆ విషయం తెలుసుకోండి. ఈ భూమిపై స్ర్తిలంటే సకల పుణ్యాలకు నెలవులని గుర్తించండి. ఏమయ్యా కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! నీవైనా చూడవయ్య.
తే.గీ. దేవునడ్డము వెట్టుకు దేవులాడు
తుందురార్జనకై కొందరెందుఁ జూడఁ
బాపమని యెంచ ఁ బోరలే వంక ఁజూడ ఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: సర్వశక్తి సమన్వితుడైన భగవంతుని అడ్డంపెట్టుకుని ఆ దేవుని పేరుతో అధిక ధనార్జనకై ప్రాకులాడే వారెందరో ఉన్నారు. ఏ వంక చూసినా అది పాపకార్యమని భావించడం లేదే? మాయలకే మాయ అయన పరమాత్మనే మాయ చేద్దామనుకొనే అమాయకులైన ఓ మనుష్యుల్లారా భగవంతుడు కనులు తెరిచి మీవైపు ఆగ్రహంతో చూస్తే ఏవౌతారు మీరు? కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనా చూడవయ్య!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262