Others

‘క్షమ’యే ఉత్తమ గుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘క్షమ’ అనే పదంలో ఉన్న రెండు అక్షరాలు చాలా ప్రాధాన్యం కలవి. అందులో క్ష అనే అక్షరం దృఢత్వాన్ని, మ అనే అక్షరం రమ్యతను తెలియజేస్తుంది. మనిషన్నవానికి గుండె గట్టిగా, మనస్సు మెత్తగా ఉండాలన్నది ఈ క్షమ చెబుతుంది.
ఇక్కడ గుండె అంటే గుండెధైర్యం ధర్మాన్ని కాపాడుతాను, శరణు అన్నవారిని రక్షించగలను. నా దేశాన్ని నేను నా శాయశక్తులా రక్షించగలను అనే ధైర్యం ఉండాలి. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, తల్లిదండ్రుల పైన ప్రేమ సౌభాతృత్వమూ ఉండాలి. తల్లిదండ్రులపైన అనురాగము, గురువులపైన గౌరవమూ, పెద్దలంటే ఆదరమూ చూపించాలని కూడా ఈ క్షమలోని అంతరార్థం.
అంతేకాక క్షమ అనేది మనిషిలో ఉండాల్సిన ఉత్తమ గుణం. పరిస్థితుల దృష్ట్యా ఎదుటివారిపైన కోపం కలుగవచ్చు. మహాత్ముల కోపం తాటాకు మంటవంటిది అంటారు. అటువంటి కోపం ఎవరి మీద అయినా ఉండవచ్చు. కానీ ఆ కోపం క్రోధంగా, ద్వేషంగా మారి ఎదుటిమనిషి ప్రాణం తీయడానికో లేక తీవ్రమైన నష్టం కలిగించడానికో పూనుకొనే కోపం ఎవరిలోను ఉండకూడదు. అట్లా ఎదుటి వారు తప్పు చేసినప్పటికీ ఆ తప్పును తెలుసుకొనేట్లు చేసి వారిలో పశ్చాత్తాపం కలిగేలా ప్రవర్తించాలి. అంతేకాని వారిపైన కసిని, ద్వేషాన్ని రగిలించుకోకూడదు. వాళ్లు తప్పు చేశామనే పశ్చాత్తాపంతో ఉన్నపుడు క్షమించగలగాలి. వారిని మంచివారిగానే చూడగలగాలి.
క్షమ ఉండేవారిలో భూదేవి మొట్టమొదటిగా చెప్తారు. భూదేవి తన్ను గునపాలతో తవ్వినా, ఇంకే యంత్రాలతో తవ్వినా, అసభ్యకరాలను భూమిపై వేసినా కూడా భూమి మనిషికి మంచే చేస్తుంది కానీ కీడు చేయదు. అందుకే భూమి అంతటి క్షమాగుణం మనిషిలోను ఉండితీరాలని పెద్దలు అంటారు. రావణుడు తప్పు చేసి సీతమ్మవారిని తీసుకొని వెళ్లి రామునితో యుద్ధానికి తలపడినపుడు ఆ యుద్ధంలో నిరాయుధుడైతే రాముడు ఇప్పటికైనా నీ తప్పును నీవు తెలుసుకొంటే నిన్ను నేను క్షమిస్తాను అని చెప్తాడు. పైగా నీవు నిరాయుధుడివి అయ్యావు కనుక వెళ్లి తిరిగి ఆయుధపాణివై రమ్ము నీతో పోరాడుతాను అని చెప్పి పంపించేస్తాడు. అది రామునిలోని క్షమాగుణం.
సమాజం పట్ల, సమాజంలోని జీవుల పట్ల , సమాజ వ్యవహారాల పట్ల ప్రతి వారు క్షమను కలిగి ఉండాలని రామాయణం చెబుతుంది. పూర్వం మునులు దానవులు చేసిన తప్పులను క్షమించేవారు. ఒకవేళ దానవులను శపించినా తిరిగి ఆ శాపాలకు విముక్తిమార్గాన్ని కూడా చూపేవారు. అందుకే వారిని మహాత్ములు మనం నేటికీ గుర్తుపెట్టుకుంటున్నాము.
. క్షమిస్తున్నారని, లేక క్షమిస్తారే అనే ఆలోచనతో తప్పులు చేయకూడదు. తప్పు చేసిన వారికి కఠినమైన శిక్ష ఉండితీరాలి. కాని ఆ తప్పును తెలుసుకొని వారిలో పశ్చాత్తాప గుణం కలిగితే మాత్రం వారిని క్షమించడం ఉత్తముల లక్షణం అని చెప్పవచ్చు. అందుకే ప్రతివారిలో ధర్మాగ్రహం ఉండి తీరాలి. క్షమించేగుణమూ అలవర్చుకోవాలి.

- కె.రామ్మోహన్ రావు 944135912