Others

శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్రాస్ టి.నగర్‌లోని నారాయణ కేఫ్. అక్కడ రెండు పొడగాటి చెట్లు. ఎప్పుడు చూసినా -వాటికింద నిలబడి అప్పటి బిజీ నటుడు సియస్‌ఆర్‌తో మరో పొడగాటి నటుడు మిత్రులతో కబుర్లు చెపుతూ కనపడేవారు. ఆ పొడగాటి నటుడే హాస్య పాత్రల ద్వారా తెలుగువారి హృదయాలను దోచుకున్న రమణారెడ్డి.
నెల్లూరులో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేస్తూ నాటకాలలో నటిస్తూ పలు ప్రదర్శనలు ఇచ్చాడు రమణారెడ్డి. మిత్రులతో కలసి లలిత కళానిలయం అనే సంస్థను కూడా స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తూండేవాడు. మిత్రుల ప్రోత్సాహించడంతో సినిమాలలో నటించాలని ధైర్యం చేసి మద్రాస్ రైలెక్కాడు రమణారెడ్డి. ఆ రోజుల్లో సినిమా ప్రయత్నాలలో ఎలాంటి బాధలు అనుభవించాలో అన్నీ అనుభవించి మదుసూరి కోదండరామిరెడ్డి సిఫారసు ఉత్తరంతో నాగయ్యను కలిస్తే -ఆ మహానటుడు త్యాగయ్య తన చిత్రంలో ఒక హాస్య పాత్రకు అవకాశం యిచ్చారు. కానీ ఆ పాత్రకై గుండు చేయించుకోవాలనే నిబంధన ఎదురుకావటంతో సమ్మతించక నెల్లూరు తిరిగి వెళ్ళాడు రమణారెడ్డి. రమణారెడ్డిని రంగ స్థలంపై చూసిన నెల్లూరుకి చెందిన శంకరరెడ్డి ‘మానవతి’ చిత్రంలో (1951) (రహస్యం, లవకుశ చిత్రాల నిర్మాత) అవకాశం కలుగచేశారు. ఆ చిత్రం తర్వాత అవకాశాలు అనుకున్న స్థాయిలో లభించకపోయినా తన టాలెంట్‌ను కొనసాగిస్తున్న సమయంలో బంగారుపాప, మిస్సమ్మ, దీక్ష, కన్నతల్లి మొదలగు చిత్రాలతో అవకాశాలు పెరగటం ప్రారంభించాయి. ఎంతగా అవకాశాలు వచ్చాయంటే సన్నగా పొడుగ్గా వుండే రమణారెడ్డికి దర్శకుడు ప్రకాశరావు రేణుకాదేవి మహత్యం చిత్రంలో నారదుడి పాత్రలో నటించే అవకాశం కలుగజేసారు. ఆ పర్సనాలిటీతో నారద పాత్రా అని ప్రేక్షకులు ఆశ్చర్యపడకుండా పల్చటి జుబ్బా ధరించి నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు రమణారెడ్డి. నారదుడి పాత్రలో ఈ గెటప్‌తో నటించిన ఏకైక నటుడు రమణారెడ్డి కావడం విశేషం. తీరిక సమయాల్లో మ్యాజిక్ ప్రదర్శనల ద్వారా నిధి సేకరణలో పాల్గొంటూ పలువురు శిష్యులకు శిక్షణ ఇచ్చారు. సినిమాల ద్వారా సంపాదిస్తున్నాను కదా అని ఉచితంగా మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చేవారు రమణారెడ్డి. ఏ నటుడికైనా పాత్రనుబట్టి శైలి కూడా మారుతుంది, ఒక్క రమణారెడ్డి విషయంలో తప్ప. ఎందుకంటే మాయాబజార్‌లోని చిన్మయలో కూడా నెల్లూరి యాసతో మాట్లాడినా మహా దర్శకుడు కె.వి.రెడ్డి అంగీకరించటమే ఒక ప్లస్ పాయింటు అయింది. ఆ పాత్ర జనంలో కూడా క్లిక్ కావటమే ఇందుకు నిదర్శనం. రేలంగి, సూర్యకాంతం కాంబినేషన్‌లో రమణారెడ్డి నటించిన పాత్రలు నేటితరం వారిని కూడా అమితంగా ఆకర్షించుతున్నాయి. ఎందరో హాస్య నటులు పరిశ్రమకు వచ్చారు, అలరించారు. కాని రమణారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి లాంటివారు. అందుకే అలాంటి వ్యక్తి ఇక రారు, రాలేరని మాత్రం ఎవరైనా అనగలరు. ఓ చారిటీ కోసం మేజిక్ షో నిర్వహిస్తూ రమణా రెడ్డి ఇలా....

-పర్చా శరత్‌కుమార్ 9849601717