Others

మౌనానికే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మౌనం బంగారం మాట వెండి అన్నారు. మాట అత్యున్నతమైంది. మనిషికి మాత్రమే ఉన్న అరుదైన అమూల్యమైన సౌలభ్యం. మాటలతోనే కోటలు కట్టవచ్చు. మంచివారికి దగ్గర అవొచ్చు. దేవునికి కూడా ప్రీతి పాత్రులం కావచ్చు. క్రోధస్వభావులను కూడా మార్చవచ్చు. చెడు దారిన పోయేవారినీ మంచిదారిలోకి మంచి మాటలు చెప్పి తీసుకొని రావచ్చు.
ఇంత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే మాటకు రెండవ స్థానానే్న ఇచ్చారు. ఎందుకిలా జరిగింది అని బాగా ఆలోచిస్తే ఏ ఆలోచనకైనా మనం మొదట మాటలు ఆపివేస్తాం. తరువాత నెమ్మదిగా ఆలోచన సాగిస్తాం. అపుడు వౌనానికున్న విలువ మనకు తెలియడం మొదలౌతుంది. వౌనం విలువ తెలిసినవారెవరైనా మాటకు రెండవ స్థానాన్ని ఇస్తారన్నమాట.
మాటతో దేవతలను మెప్పించగలిగితే వౌనంతో అహం బ్రహ్మస్మి మనమే దేవతలం కావచ్చు అన్నమాట. అందుకే వౌనానికి అంత విలువ ఇస్తున్నారు.
కేవలం వౌనమే ధ్యానంగా చేసుకొని సాధన సాగిస్తే సృష్టిచక్రంలోని ఎన్నో అద్భుత విషయాలను ఆవిష్కరించవచ్చు. వౌనంగా ఆలోచించి ఇహలోకంలోను పరిష్కారం కష్టతరంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చూపే మార్గాన్ని అనే్వషించడంలో సఫలురం కావచ్చు. అందుకే రమణ మహర్షి లాంటి వారు వౌనంగానే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నారు. దక్షిణామూర్తి వౌనంగా కూర్చున్నా అతని శిష్యులు మాత్రం వారి సందేహాలను వారి గురువుగారి వల్లనే తీర్చుకున్నారట. అంటే వౌనంవహించినా ఎదుటివారి సందేహనివృత్తి చేసేశక్తిని పొందవచ్చు.
కనుకనే వౌనాన్ని కనీసం వారంలో ఒకరోజు అయినా స్వీకరించాలి. అంటే రోజంతా వౌనంగా ఉండాలి. వౌనదీక్ష తీసుకోవాలి. కానీ ఈ దీక్ష తీసుకొన్నపుడు ఎంతటి అవసరం వచ్చినా మాట్లాడకూడదు. ఆ విషయానికి సంబంధించిన ఆలోచన కూడా మనసులో సాగకూడదు. అపుడే పూర్తి వౌనదీక్షను సాగించినట్లు అవుతుంది.
వౌనంగా ఉన్నామని అందరికీ చెప్పి ఎవరైనా మాట్లాడడానికి వస్తే మేము వౌనదీక్ష తీసుకొన్నామని రాసి చూపించడం, వారికి కావల్సిన విషయాన్ని రాత ద్వారా తెలుసుకొని వారికి సూచనలను రాత ద్వారా ఇవ్వడమూ కొందరు చేస్తుంటారు. ఇది వౌన దీక్ష కాదు. వౌనదీక్షను హాస్యాస్పదం చేస్తున్నట్టు అవుతుంది. ఇది అయినా కాకపోయినా వౌనం ద్వారా పొందవలసిన ఫలితాన్ని పొందలేకపోతారు.
కనుక వౌనాన్ని పాటించదలిస్తే పూర్తిగా వౌనంగా ఉండాలి. మొట్టమొదట ఒక గంటపాటు తర్వాత మెల్లమెల్లగా సమయాన్ని పెంచుకుంటూ వౌనదీక్షను సాగిస్తే మెరుగైన ఫలితం ఉండవచ్చు. కనుక కనీసం వారానికి ఒకరోజు వౌనంగా ఉందామన్న ఆలోచన కలిగించుకుందాం.

- ఆర్. పురందర్