Others

నాకు నచ్చిన సినిమా (మహామంత్రి తిమ్మరుసు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణదేవరాయల కాలం 16వ శతాబ్దాన్ని కళ్లముందు ఆవిష్కరించిన మహోజ్వల చిత్రరాజం ‘మహామంత్రి తిమ్మరుసు’. శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీ రామారావు, తిమ్మరుసుగా గుమ్మడి పోటీపడి నటించిన చిత్రం ఆబాలగోపాలాన్ని ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. శ్రీకృష్ణదేవరాయలు రాజుగా పట్ట్భాషిక్తుడు కావడం, తిమ్మరుసు తనదైన శైలిలో రాజును కట్టడి చేయడం, తిరుమలాంబతో రాజకీయపరమైన స్నేహంకోసం శ్రీకృష్ణదేవరాయలతో అప్పాజీ పెళ్లిచేయడం, ఓ నాట్యకత్తె నటనకు ముగ్ధుడైన కృష్ణదేవరాయలు ఆమెను వివాహమాడటం, శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు అప్పాజీ రాజకీయ చతురతతో యుద్ధాన్ని జరగకుండా నివారించడం లాంటి ప్రతీ అంశం ఈ చిత్రంలో ఆకట్టుకునేలా చిత్రీకరించారు. మోహనరాగమహా, జయవాణి చరణకమల సన్నిధిమన సాధనా, లీలాకృష్ణ నీ లీలలు నేనెరుగనుగా, చరిత్ర తెలియని మహాపరాధం మాకే కలిగినదా! అన్న పాటలు ఇప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి. ఎల్ విజయలక్ష్మి, దేవిక, జి వరలక్ష్మి, రాజశ్రీ, రేలంగి, శోభన్‌బాబు, ధూళిపాళ లాంటి గొప్ప నటులతో చిత్రాన్ని అజరామరంగా తీర్చిదిద్దారు. తెలుగు చిత్రాల్లో ఇప్పటికీ ఆణిముత్యంలా వెలుగొందుతుంది ఈ చిత్రం. చరిత్ర తెలియని నేటి యువతకు ఈ చిత్రం చూపించాల్సిన ఆవశ్యకత ఉంది.

-జటంగి కృష్ణ, రాజాపురం