Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నభోమండలాన్ని చూపుతో తడిమినప్పుడు
కదలని సూర్యుణ్ణి కదిలించిఉదయాస్తమాయాల
ఏకత్వాన్ని రెండుగా విడగొట్టిన భూమి కనిపించింది
విశ్వ శూన్యంలో తిరిగే బ్రహ్మాండమైన చక్రం..
మరకతాల్ని పులుముకొన్న అడవుల మీంచి
అలలు అలలుగా దొర్లుకుంటూ
సలిల కల్పాలవటం వల్ల కాబోలు చల్లగా వున్నాయి
జీవన వ్యవసాయంగా సాగే మనుకంద మరుత్తులు..
సౌందర్యాన్ని విచ్చుకుంటున్న పొద సుమధన్వి
తన సుగంధ స్వారస్యాన్ని నా చెవిలో ఊదింది
దాన్ని వివరించి మీకు చెప్పటానికి
నా భాష చాలదు శబ్దాల చుట్టుకొలతగా సంఘీభావం
స్పష్టమయ్యేటట్లు
నా హృదయంలో ఒక పద్యం మాత్రం
రగులుతోంది పాదాలు కొనే్న
పరిమళాన్ని పది అంతస్తులు పెంచి
పాటగా మార్చి భూమి మీదకు వదులుతోంది
పద్యం మనిషి విజయానికి ప్రభాత నాదమైతే
పాట పల్లవిత చరణాలతో గళమెత్తిన శంఖం
నా పాట పరిచిన సుహృద్భాస్వరంలోంచి
ప్రజలు వారి వారి గొంతుల్ని ఏరుకుంటారు
ఇది ప్రాయోజిత పరాకాష్ఠ...
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404