Others

పిల్లల క్షేమం.. పోలాల అమావాస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ హిందూ సంప్రదాయంలో కందమొక్కకు పోలాల అమావాస్య రోజు పూజిస్తారు. కందగొడుగు పూజలు అనీ కూడా దీనికే పేరు. ఒక నెల రోజుల ముందునుంచే కంద దుంపను భూమిలో పాతి ఉంచాలి. పోలాల అమావాస్య రోజుకు ఆ కంద మొక్క అంకురించి గొడుగు వలె వస్తుంది. పసుపు కుంకుమలతో కందమొక్కను అలంకరించి గాజులు, రవికల గుడ్డను పెట్టి గౌరిదేవిగా భావించి పూజించడం సంప్రదాయం. ముందుగా నేలను ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి దానిపై ఈ కందమొక్కను పెట్టి అలంకరించాలి. నైవేద్యంగా బూరెలు, గారెలు నివేదిస్తారు. మగపిల్లలను కన్న తల్లులు బూరెలు, ఆడపిల్లలను కన్న తల్లులు గారెలు గౌరీదేవికి నివేదించడమూ అక్కడక్కడ కనిపిస్తుంది. పిల్లలు లేని వారు వారి వారి కోర్కె ననుసరించి బూరెల దండను, గారెల దండలను కందగొడుగును సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల వారు మరుసటి సంవత్సరం పిల్లల తల్లు లు అవుతారని నమ్ముతారు.
అంతేకాక ఈ వ్రతానికి బహుబిడ్డలున్న తల్లిని పోలేరమ్మగా భావించి పూజిస్తారు.
వ్రతకథ: ఒక ఇల్లాలికి ఏడుగురు కోడళ్లు, కొడుకులు ఉండేవారు. వీరుప్రతి సంవత్సరం పోలాల అమావాస్య నాడు పోలేరమ్మకు పూజలు చేసేవారు. కాని ఒకసారి వారి ఏడో కోడలికి పుట్టిన పిల్ల చనిపోవడం వల్ల వారు పోలేరమ్మ పూజ చేయలేకపోయేవారు. అప్పటినుంచి ఆరేళ్లు వారికి పిల్లలు పుట్టడం చనిపోవడం తో వారు ఈ పోలేరమ్మను పూజించలేకపోయారు. మిగతాకోడళ్లు కూడా ఈ ఏడో కోడలి వల్ల తాము పూజ చేసుకోలేకపోతున్నామని వారంతా వేరుపడ్డారు. దానివల్ల ఏడో కోడలు మనస్తాపం చెందుతుంది. అట్లా వేరుపడిన తరువాత వచ్చిన సంవత్సరం కూడా ఏడో కోడలికి పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఆమె ఎంతో దుఃఖించింది. అందరూ పోలేరమ్మకు పూజలు చేస్తుండడం చూసి తన చనిపోయిన కూతురును ఇంట్లోనే పెట్టి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా పోలేరమ్మ గుడికితన తోడికోడళ్లతో వ్రతం చేస్తుంది. కానీ తన దుఃఖాన్ని ఆపుకోలేక సాయం సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ పోలేరమ్మగుడిలో కూర్చుని ‘అమ్మా నేను చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసి నాకు నీ పూజను చేసుకొనే భాగ్యాన్ని కలిగించు అమ్మా. నాకు పుట్టిన బిడ్డలను బతికించు అమ్మా’అని వేడుకుంది. ఆమె పడేవేదన చూసి బిడ్డలను కాపాడే పోలేరమ్మ ఆమె దగ్గరకు వచ్చి ‘సుగుణా! నీవు దుఃఖించకు. ఈ అక్షింతలు తీసుకొని వెళ్లి ఇపుడు నీ ఇంట్లో ఉన్న నీ మృత శిశువుపైన చల్లు . నీవు ఇంతకుముందు పోగొట్టుకున్న వారిని పేరు పెట్టి పిలుస్తూ ఈ అక్షింతలు చల్లు నీవు బిడ్డలున్న తల్లివి అవుతావు’ అని చెప్పింది.
ఆమె ఎంతో సంతోషంతో పోలేరమ్మకు దణ్ణం పెట్టి అమ్మవారు చెప్పినట్లుగానే చేసింది. అంతే ఒక్కమాటుగా చనిపోయి పడుకుని ఉన్న కూతురితో పాటు బిలబిలమంటూ ఇంతకుముందు తాను పోగొట్టుకున్న బిడ్డలంతా తన దగ్గరకు రావడం చూసి ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. ఈ సంగతి తన అత్తమామలకు, తోడికోడళ్ళలకు కూడా చెప్పి తన బిడ్డలందరినీ వారికి చూపిస్తుంది. ఈ సంగతి తెలుసుకొన్న వారంతా పోలేరమ్మకు పూజలు చేయడం ఆరంభిస్తారు. వీరే కాక ఆ ఊరి వారంతా బిడ్డలను కాపాడే దేవతగా పోలేరమ్మను శ్రావణమాస అమావాస్యనాడు పూజించడం ఆరంభం చేసారు. కనుకనే నేడు కూడా ఈ అమావాస్యను పోలాల అమావాస్యగా సంభావిస్తూ పోలేరమ్మను పూజించడం ఆనవాయితీగా మారింది. బిడ్డలను చల్లగా చూడాలన్నా బిడ్డలకు ఏరోగం రాకుండా ఉండాలన్నా ఈ పోలాల అమావాస్యనాడు పోలేరమ్మను అంగనలందరూ పూజిస్తారు.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి