Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యలహరుల మీద
ఛందస్సనే తెరచాపకట్టిన ప్రాబంధికప్పడవ
ఊహాతీత సౌందర్యమై ఊగుతోంది
నాకళ్ళమీద సీతాకోకచిలకలు వాలుతున్నాయి
సంధ్యలో తడిసిన నా పాటకు
మునిమాపు గొంతునిచ్చినప్పుడు
రెక్కల్లో స్వరాల్ని అదుముకొంటూ పక్షులు
పాదపాన్ని చేరుకుంటున్నాయి
ఆకాశం ‘పంచదశీప్రమిద’ను మోసుకొస్తోంది
నక్షత్రాలను చిత్రిస్తున్న చెట్టు కొమ్మకు
నా చేయి తగిలింది
చెరువులోని చిటి తరగల తీగెల్ని
గాలివ్రేళ్లు మీటుతుంటే
నెరవంతా వెనె్నల గాంధర్వం విహరిస్తోంది
కాలం నా రక్తంలో ప్రవేశించి
అక్షరమై అందరిలోకి అంతర్భవించేటప్పటికే
వాక్యం రసాత్మకమైంది
ఆంతర్య జ్వాలలోని రహస్యాలను కొల్లగొట్టే
ప్రయత్నాలు ప్రారంభమైనట్లున్నాయి
ఎన్ని కోర్కెలతో భూమండల యాత్రకు తయారయ్యాడో మనిషి
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404