Others

కుడుముల మారాజు ( ఉండ్రాళ్ల తద్దె)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భాద్రపద శుక్ల తదియ వరాహ జయంతి. వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాలలో మూడవది వరాహావతారం. ఈ అవతారం ఆవిర్భవించినది భాద్రపద శుద్ధ తదియను వరాహ జయంతిగా సంభావిస్తున్నారు.
పూర్వకాలంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని చాపగాచుట్టి, సముద్రంలో దాచివేసాడు. భూదేవి శ్రీ మహావిష్ణువుతో మొర పెట్టుకొని, శరణువేడినది. శ్రీహరి భూదేవికి అభయం యిచ్చి, స్వయంగా వరాహరూపమెత్తి, హిరణ్యాక్షుని సంహరించింది. భూమిని తన కోరలతో సముద్రమునుండి పైకి తెచ్చాడని వరాహ పురాణం చెబుతుంది. ఈ వరాహ మూర్తినే భూవరాహమూర్తియని, ఆదివరాహమూర్తియనీ, నరవరాహమూర్తియనీ పిలుస్తారు. యజ్ఞవరాహమూర్తిగాకూడా ఆరాధిస్తారు.
వరాహమూర్తిని పూజించినచో విశేష ఫలం లభిస్తుంది గావున ఈ జయంతినాడు వైష్ణవాలయాలకు వెళ్లి స్వామిని దర్శించి, ఆరాధనలు, అర్చనలు చేయాలి. నైవేద్యాలు సమర్పించాలి. స్వామి ఆశీస్సులు పొందాలి.
శ్లో: మందారమాలా - కలితాలకాయై
కపాల మాలాంకిత శేఖరాయ
దివ్యంబరాయైచ - దిగంబరాయ
నమశ్శివాయైచ - నమశ్శివాయ- అంటూ 2స్ర్తీపుఠుషులిద్దరూ పార్వతీ పరమేశ్వరులను పూజించే తిథి భాద్రపద తదియ.
శుద్ధ తదియనాడే కుడుముల తద్దె వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. కుడుముల తద్దెకు పూర్వం ఒక గాథ వుంది. ఒక గ్రామంలో భూలక్ష్మి, శ్రీలక్ష్మి అనే అక్కచెల్లెళ్లు ఉండేవారు. శ్రీలక్ష్మి నాస్తికురాలు. భూలక్ష్మి ఆస్తికురాలు. అన్ని విషయాల్లో యిద్దరికీ ఎంతో వ్యత్యాసం. భక్తితో వున్న భూలక్ష్మి ఎవరు ఏ నోము నోచమంటే శ్రద్ధ్భాక్తులతో చేసేది. ఒక రోజు ఆ గ్రామానికి ఒక పండితుడు వచ్చి ఆ గ్రామస్థులకు పదహారు కుడుముల తద్దె నోము గురించి వివరించాడు.
ఆ వ్రత విషయాలు విన్న భూలక్ష్మి శ్రద్ధగా ఆ వ్రతాన్ని చేసింది. శ్రీలక్ష్మి నాస్తికురాలు గాన నాకు వ్రతాలూ, నోములూ వద్దు అని హాయిగా పిండివంటలు చేసికొని తిన్నది. దేవతలూ లేరూ, దేవుళ్లూ లేరు. వారి పేర్లు చెప్పి తినడానికే ఈ నోములూ, వ్రతాలు పెట్టారు. అంతా ఒక బూటకం, మాయ. వీటివల్ల ఏ ఫలితం ఉండదని ఏవో చెబుతూ ఉండేది.
కొంతకాలం పిదప శ్రీలక్ష్మి సంపదలన్నీ పోయి దరిద్రం కల్గింది. ఊరంతా తిరిగి బిచ్చమెత్తుకుని జీవించేది. ఒక్కో రోజు ఎవరూ ఏమీ పెట్టేవారు కాదు. ఒక రోజున ఒకచోట పాడుబడిన గౌరీదేవి ఆలయంలోకి వెళ్లి ఆ దేవితో తన కష్టాలను విన్పించి, దుఃఖించింది. దయతో గౌరీదేవి కరుణించి ప్రత్యక్షమై, అమ్మా! లక్ష్మీ బాధపడకు. నీవు భక్తితో పదహారు కుడుముల నోముచేస్తే నీ బాధలు తీరుతాయి. గ్రామస్థుల సహకారం కోరి ఆ నోము చేసుకో అని దీవించి వెళ్లింది.
శ్రీలక్ష్మికి ఆ రోజు గ్రామస్థులు ఆమె కోరినవన్నీ అందించారు. వారి సహకారంతో నోము నోచుకొని తిరిగి ధనవంతురాలైంది. సకల సంపదలనూ పొందింది. నోము నోచుకొన్న పిదప ఉద్యాపన చేయాలి. ఈ కథను చదువుకొని పవిత్రమైన అక్షతలను శిరస్సున చల్లుకోవాలి. గౌరీదేవిని పూచించి 16 కుడుములు, నల్లపూసలు- లక్కజోళ్ళు- దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. 16 మంది ముత్తయిదువులకు 16 చేటలతో వాయనం యిచ్చి, పిదప అన్నదానం చేయాలి. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినవారికి కష్టాలుండవు. సంపదలు కల్గుతాయి. దరిద్రం తొలగిపోతుంది.

- కె. వాణిప్రభాకరి