AADIVAVRAM - Others

గణపతిని పూజింపరారే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపతిని పూజింపరారే
శ్రీ మహాగణపతిని పూజింపరారే
భాద్రపద శుద్ధ చవితినాడూ
భద్రముగ వచ్చి చేరినాడూ
మ్రొక్కులెన్నో మొక్కి మొక్కి
దిక్కులన్నీ దద్దరిల్లంగా
పాలవెల్లిని కట్టి పూలమాలలు జుట్టి
ముద్దు మురిపాలతో ధూప దీపాలతో
మారేడు నేరేడు పత్రి జాపత్రితో
విఘ్నములు తొలుగంగ లగ్నములు కుదరంగ
కుడుములూ, ఉండ్రాళ్లు తిన్నంతగా బెట్టి
ఒ బొజ్జ గణపయ్య నీ బంటు నేనంటూ
పద్దెములు తెగ జదివి గుంజిళ్లు తెగ గుంజి
పూదేనియల దెచ్చి, పూజాక్షతల నిచ్చి
చవితి చంద్రుని జూడ నిందలే రాకుండ
చెవినెంతో శ్రద్ధగా కథ వైపు మళ్లించి
ఇంటిల్లపాదీ సుఖశాంతులలర
కంటి పాపల్లే కాపాడు వాని

- ములుగు కుమారస్వామి (షణ్ముఖశ్రీ) 88978 53339