Others

ఫ్రీనా.. నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలన్న పెద్దల మాటను పెద్ద మనసుతో పాటిస్తోంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక -కాలు కదపాలన్నా కోట్లు కుమ్మరించాలని డిమాండ్ చేస్తోందట. పాపులారిటీ పెరిగాక చిన్న చిన్న మొత్తాలకు పని చేయాలంటే ఒప్పుకోనంటోంది. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తున్న ప్రియాంక అస్సాం టూరిజం ప్రచారం కోసం కూడా కోట్లల్లోనే డిమాండ్ చేస్తోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న అసోంకు తనవంతు సాయం చేయాల్సిందిపోయి భారీస్థాయిలో రెమ్యునరేషన్ అడిగేసరికి అధికారులు అవాక్కయ్యారట. సహజంగా బాలీవుడ్‌లో ఆర్థికంగా వెనుకబడివున్న రాష్ట్రాల కోసం ఉచితంగా పనిచేసే సంప్రదాయం కనిపిస్తోంది. అదే విధంగా ప్రియాంక చోప్రాను సంప్రదిస్తే రెమ్యునరేషన్ భారీస్థాయిలో ఉండాలంటూ 15 కోట్లకు టార్గెట్ పెట్టిందట. దానికి వెనుకంజ వేసిన అధికారులు కార్యక్రమాన్ని చేయాలా? వద్దా? అన్న ఊగిసలాటలో పడ్డారు. ప్రియాంక మాత్రం తన స్టేటస్‌కు తగిన విధంగానే భారీ పారితోషికాన్ని వసూలు చేయాలని అనుకుంటోంది. చివరికి ఏం చేస్తుందో చూడాలి!