Others

పరశుధరునకు ప్రణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహీ
తన్నోదంతి ప్రచోదయాత్
శ్లో వక్రతుండ మహాకాయ - కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా
తొండం ఓంకారానికీ, ఏకదంతం పరబ్రహ్మకూ, చెవులు శ్రవణానికి, లంబోదరం స్థిరత్వానికి సంకేతంగాన ఈ త్రికోణ మధ్యగతుని ఈ పర్వదినాన మనసారా ఆరాధించి తరిద్దాం. ఆశీస్సులందుకుందాం. ఇదే విఘ్నేశ్వర తత్త్వం. విద్యాబుద్ధులను ప్రసాదించే పార్వతీ పుత్రుని స్మరిద్దాం. భాద్రపద శుద్ద చవితినాడు ఓం గం గణపతే నమః అందాం.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
హిందూ సంప్రదాయంలో ఒక ప్రతిష్ఠాత్మక ప్రత్యేక పీఠాన్ని అలంకరించిన దైవం 3వినాయకుడు. గణపతి ప్రార్థనతోనే విశ్వంలోని జనులు ప్రతి పని, శుభకార్యాలు ఆచరించడం భారతీయుల ఆనవాయితీ. సమస్తప్రజ వైభవంగా జరుపుకొనే పర్వదినం ఇది.
శ్లో శుక్లాంబరథరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోఫ శాంతయే-
అంటూ ప్రార్థిస్తారు.
గణపతి ప్రజల నిత్య జీవితంలో ఒక విడదీయరాని విభాగమైపోయాడు. జనం తన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా గణపతిని ఆరాధిస్తారు. ఇది అందరి విశ్వాసం.
జననం
వినాయకుని జననం ఎంతో అద్భుతమైనది. పరమశివుడు ఒక రోజు పార్వతీదేవి స్నానమాచరించుటకు వెళుతూ కాపలాగా ఎవరినీ రానీయకు అంటూ అంతకుముందు ప్రీతితో నలుగుతో చేసిన బొమ్మకు ప్రాణం పోసింది. ఆ బాలుడికి తగిన జాగ్రత్తలు తెలిపి ద్వారం వద్ద కాపలా వుంచి వెళ్లింది. అనుకోకుండా శివుడు లోనికి వచ్చాడు. అమ్మవారు చలించి సిగ్గుపడినది. స్నానం ఆపి అంతఃపురంలోనికి వెళ్లింది.
శివుడు రావడం చూడడం పార్వతికి నచ్చలేదు. అమ్మవారి చెలికత్తెలు జయ, విజయలు ఆమెకు సలహా ఇస్తూ, తల్లీ- ఇక్కడ ఎందరు సేవలు చేసినా ఎన్ని సౌకర్యాలు కూర్చినా వారందరూ శివగణాలే కదా. వారు మనవారు కారు. శివునికి ఎదురు మాట్లాడారు. శివుడు కూడా ఏమీ అనరు. కావున మనకంటూ ఒక వ్యక్తి వుంటే తప్ప, ఎవరి యధేచ్ఛాగమన, నిర్గమనాలను మనం నిరోధించలేం అని సలహా ఇచ్చారు.
పార్వతికి సలహా నచ్చింది. వెంటనే తన మేను నలచింది. ఆ వచ్చిన పదార్థంతో ఒక పురుషాకృతిని నిర్మించి ప్రాణం పోసింది. సర్వాంగ సుందరుడైన బాలుని దీవించి ద్వారపాలకునిగా నియమించినది. బాలుడు మాతృగృహ ద్వార రక్షణగావిస్తున్నాడు. ఇంతలో శివుడు వచ్చాడు.
శివుని ద్వారం వద్దనే నిలిపాడు బాలుడు. వివరాలు చెప్పినా వినలేదు. వెనుదిరిగి వెళ్లమన్నాడు. శివునికి కోపం వచ్చింది. బాలకుని జన్మను గ్రహించాడు. శక్తి పార్వతి దీవించిన బాలుడు సామాన్యుడు కాడని భావించాడు. ఆలోచించాడు. శివగణాలు కోపగించాయి. శివుని అనుమతితో బాలుని తొలగించడానికి సిద్ధమైనారు. ముమ్మారు శివగణాలను తరిమాడు. బైట కలకలం విని పార్వతి ఆశ్చర్యపడింది. తన సేవికల ద్వారా బాలుని ప్రోత్సాహించింది. రెచ్చిపోయాడు బాలకుడు. అందరినీ పారద్రోలాడు. బ్రహ్మాదులు వచ్చారు.
శివుని ప్రార్థించారు. బాలునితో మీరే సంప్రదింపులు జరుపుకోండి అన్నాడు శివుడు. బ్రహ్మ యత్నించినా వినలేదు. విష్ణువుకూడా యుద్ధం చేశాడు. లోకాలన్నీ ఆశ్చర్యపోయాయి. శంకరుని శరణువేడారు. శివుడు కోపంతో గురిచూసి త్రిశూలంతో బాలుని కంఠాన్ని ఉత్తర దిక్కున నిలిచి ఖండించాడు. బాలుని శిరసు శివుని చేతిలో పడింది. పార్వతి వచ్చి రోదించింది.
ఆమె ఆవేశం నుండి శక్తులు పుట్టాయి. దేవతలు అయోమయంలో పడ్డారు. నారదుని మధ్యవర్తిగా అమ్మవారి వద్దకు పంపారు. శాంతించమన్నారు. నారదాది ముని బృందాలు స్తోత్రాలు చేయగా శాంతించింది. నా కుమారుని పునరుజ్జీవితుని చేస్తే నా గణాలను వెనక్కి తీసుకుంటాను అని అన్నది. శివుడు సరేనన్నాడు. ఉత్తర దిశగా వెళ్లి మొదటగా ఏ జంతువు కన్పిస్తే దాని తల తీసికొని రండి అని ఆదేశించాడు శివుడు. ఉత్తర దిశగా వెళ్లినవారు ఒక ఏనుగు తలను తెచ్చారు. మొండానికి అతికించారు. హే శివా! నీ తేజస్సుతో మేమందరం జీవులుగా వున్నామో, ఆ తేజస్సు ఈ బాలకుని కళేబరం ముందు కూడా ప్రవేశించుగాక అని వేడారు. శివానుగ్రహం కలిగింది.
నిద్రలేచినవాడిలా ప్రాణియైనాడు. ఆ బాలకుని అమ్మవారికి చూపించారు. సంతసించింది. గజముఖుడిగానైతేనేం తన బిడ్డ తిరిగి బ్రతికినాడని శాంతించింది.
దేవతలందరూ గొప్ప ఉత్సవం చేశారు. సర్వగణాధిపతిగా బాలకుని పట్ట్భాషేకం చేశారు. పార్వతి ఆనందించి మంచి వస్త్రాలు అలంకారాలను బహూకరించింది. సింధూర వర్ణంతో అలరారుతున్నావుగాన నీవు సింధూరంతో పూజింపబడతావు. దేవతలందరిలోను అగ్రపూజ, తొలిపూజ నీకే దక్కుతుంది. షోడశోపచారాలతో పూజించి నీకు నైవేద్యాలు అర్పించినవారికి విఘ్నాలు తొలగిపోతాయి. సర్వసిద్ధులూ సమకూరుతాయి అంటూ వరాలిచ్చింది మాతృమూర్తి. పరమశివుడు గణపతిని తన బిడ్డగా ప్రకటించాడు. బ్రహ్మ విష్ణులు దీవించారు. మావలె నీవు కూడా సర్వత్రా పూజనీయుడగుదువుగాక!
ఎవరైతే నిన్ను పూజించకుండా మమ్మల్ని పూజిస్తారో వారి పూజలు నిరర్థకమైపోతాయంటూ, ముందుగా నిన్ను కొలిచినవారికి సర్వవిఘ్నాలు తొలగుతాయని ఆశీర్వదించారు.
శివుడు దీవిస్తూ, నీవు భాద్రపదమాసంలో శుక్లపక్ష చతుర్థినాడు చంద్రోదయానికి ఒక జాము ముందర ఉదయించావు గాక అది నీ జన్మదినమై విరాజిల్లుతుంది. వినాయకచవితి పర్వదినంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున నిన్ను ఆరాధించినవారికి విఘ్నాలు తొలగి ఇహపరాలు లభిస్తాయని శివుడు గణేశ చతుర్థి పర్వదిన విశిష్టతను వివరించాడు.
మహిషాసుర సంహారవేళ రాక్షసుల యంత్ర రూపంలో అవరోధం కల్పిస్తే దానిని తొలగించి లోకమాతకు సాయపడ్డాడు. ఆ తల్లి ఇచ్చిన వరంవల్ల తొలి పూజలందుకొనే వేల్పుఅయినాడు. నాటినుండే విఘ్నేశ్వరుని పూజించడం సంప్రదాయమైంది. ఆయన ఎలుక వాహనుడు. మూషిక వాహనం. చవితినాడు పూజలందుకొని గణపతి నైవేద్యాలు కడుపునిండా తిని తల్లిదండ్రులకు వంగి నమస్కరించబోయిన వేళ శివుని తలపైనున్న చంద్రుడు నవ్వాడు. తల్లి కోపగించి శాపం పెట్టింది. ఆ కారణంగా చవితినాడు చంద్రుని చూడరాదు. చూచినవారి నీలాపనిందలు వస్తాయన్నది. శాపవిమోచనం చెప్పింది. వినాయక కథ చదువుకొని అక్షింతలు వేసుకొంటే శాపం పోతుందన్నది. నీలాపనిందలు భరించినవారిలో ద్వాపర యుగ కృష్ణుడున్నాడు.
చవితినాడు గణపతిని 21 పత్రాలతో (ఏకవింశతి) పూజించాలి. వారికి సత్కర్మలు, విజయం, జ్ఞానం, మోక్షం కల్గుతాయి. ఓంకార స్వరూపుడు. ఈ పర్వదినంనాడు దేశమంతటా ఇండ్లలో పూజ కొరకు 21 రకాల పత్రిని తెచ్చి గణపతికి నైవేద్యంగా కుడుములు, ఉంద్రాళ్ళు, వడపప్పు, పానకం, అరటి, నారికేళాలు సమర్పిస్తారు. సాయంత్రం తిరిగి ఆరాధించి అక్షింతలు వేసుకుంటారు.

-పి.వి.సీతారామమూర్తి 9490386015