Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పెద్దలను పిన్నలం జేసి వెక్కిరించి
హేళనగ మాటలాడెడి హీనమతులు
శ్రమను తామెరుగరుకదా ! ధరణిలోనఁ
గనులు తెరవరు తెరిపింప ఁ గదలు వారి ఁ
భావం: అనేక సందర్భాలలో హీనబుద్ధిగలవారు కొందరు పెద్దవాళ్లను కూడా పిల్లలుగా భావించి వెక్కిరిస్తూహేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఆత్మజ్ఞాన శూన్యులై తమను తాము తెలుసుకోలేని స్థితిలో ఉండి కూడా ఇతరులు మూర్ఖులని భావిస్తుంటారు. పైగా వీరు సమాజం కళ్లు తెరిపించాలనుకుంటుంటారు అట్లాంటి తెలివి తక్కువ వారిని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! అలాంటివారిని ఓ కంట కనిబెడుతుండవయ్య స్వామీ !
తే.గీ. ర్యాంకులవి వచ్చిపడిన చాలింకమాదు
పిల్లలకు లోటు లేదంచుఁ బెద్దవారు
మూర్ఖముగ యోచనలఁ జేయ మొదలు గూలుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: నేటి కాలంలోమా పిల్లలకు మంచి మంచి ర్యాంకులొస్తేచాలు మాకింక ఎటువంటి లోటు ఉండదని పెద్దవారు మూర్ఖంగా ఆలోచిస్తున్నారే మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మస్థైర్యం వంటి వెనె్నన్నో కలిగియుంటేనే కదాబంగారు భవిష్యత్తు ముందుపరచుకునేది! అవన్నీ విడిచి పెట్టిర్యాంకులే పరమావధిగా భావిసే తమూలమే కూలిపోతుందని పెద్దలు ఆలోచించడం లేదే?కర్మసాక్షివైన ఓసూర్యదేవా చూడవయ్య లోకప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262