Others
అందమే ఆనందం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 September 2019
- జి.ఎస్.కె. సాయబాబా, 7416511995

ఎనె్నన్ని అందాలు ఈ భూమి మీద
ఎన్ని ఆనందాలు, ఈ బ్రతుకులోన
కడలి కెరటాలపై
కదులునొక అందం
కొండ కొమ్మున
కూరుచుండనొక అందం!
తేనెటూహలలోన
తేలుటానందం
అంబరాన విమానయాన మానందం
పల్లె బడిలోన వర్ధిల్లు ఒక అందం
పట్టణాలకు ఆటపట్టు వొక అందం
పూలు నగుపూలు పొంగించు ఆనందం
ఉభయ సంధ్యారాగ విభవమానందం
అన్ని అందాలొక్కటయ్యె నీయందే
అన్ని ఆనందాలు ఆడు నీముందే
అందమానందం
ఆనందంమందం
అందుకే నా గమ్యమాయె
నీ డెందం!