Others

అంతరార్థం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వినాయక చవితి’, దసరా, దీపావళి, కార్తీక ద్వాదశి, ముక్కోటి ఏకాదశి ఇలా సంవత్సరం పొడువునా ఎన్నో పండుగలు, పర్వాలు వస్తూనే ఉంటాయ. చిన్న పె ద్దా తేడాల్లేకుండా ఎంతో సంబరంతో కొత్త వస్త్రాలు కట్టుకుని ఎన్నో కొత్త కొత్త పిండివంటలు చేసుకొని తింటూ ఉంటారు. మరెన్నో సంబరాలు చేసుకొంటూ ఉంటారు.
కానీ మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుకా ఓ పరమార్థం దాగిఉంటుంది. దాన్ని తెలుసుకొని పండుగ చేసుకొంటే మనకు పుణ్యం పురుషార్థమూ వస్తాయంటారు. అందులో అందరూ ఇష్టంగా జరుపుకునేవి వినాయక నవరాత్రి మహోత్సవాలు. ఇపుడు ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం ద్వారా సుఖ సంతోషాలు.. ఆయురారోగ్యాలు పొందవచ్చునన్నది భక్తుల విశ్వాసం. గృహాల్లోనూ... దేవాలయాల్లోనూ.. బహిరంగ ప్రదేశాల్లోనూ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి నవరాత్రులూ భక్తిశ్రద్ధలతోజరుపుతుంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తు ఉంచుకోవాలి.
పండుగ అంటేనే పరిశుభ్రతకు తార్కాణం. గృహాలు.. దేవాలయాలు.. వ్యాపార సంస్థలు.. వాడే వాహనాలు ప్రతి పండుగకు ముచ్చటగా అలంకృతమై దర్శనమిస్తాయి. ఉదయానే్న లేచి కాలకృత్య తలస్నానాదులు పూర్తిచేసుకుని మంచి వస్తమ్రులు ధరించి ఆనందంతో దేముని పూజను ప్రారంభిస్తాం.
ఈ పండుగులు మనుషుల్లో ఒక అనురాగాన్ని, ఐకత్యారాగాన్ని నింపుతాయ. సమాజంలోని అందరూ ఇందులో పాల్గొనడం వల్ల ప్రతి పండుగా సామాజిక ఐక్యతా పండుగగానే కనిపిస్తుంది.
ప్రతి పండుగలో ఏదో ఒక దేవతనో, దేవుడినో ఆరాధించమని నైవేద్యం సమర్పించ మని చెప్తుంటారు. దీనిలో ఆంతర్యం తాను తయారుచేసింది భగవంతు నికి అర్పించడం వలన తాను నిమిత్త మాత్రుడి నని అనుకోవడం, దానితో అహంకారం అడుగంటిపోవడం జరుగు తుంది. పైగా ఆ భగవంతునికి నివేదించిన పదార్థాలను నలుగురికీ పంచి తాను సేవించడం వలన నలుగురికీ ఆనందాన్ని పంచిన వాడు అవుతాడు. ఇవ్వడంలోని త్యాగం అనుభవానికి వస్తుంది.
ఇలా పండుగ ఆంతర్యం తెలిసికొని ఆచరించాలి. పండుగలోని ఆచారాన్ని అంతరార్థాన్ని ఇతరులకు తెలియచెప్పాలి. దేనినైనా పరమాత్మకు అన్వయంచి ఆధ్యాత్మిక పధంలో ఆలోచించి ఆచరిస్తే పండుగ ఆనందం వేయ దీపాల వెలుగుతోవెల్లి విరుస్తుంది. ప్రతిపండుగలోని ఆరోగ్యం.. ఆధ్యాత్మికత.. ఐక్యత.. సామాజిక బాధ్యత అన్నింటినీ మించిన విజ్ఞానం దాగి వుందని అసలు నిజాన్ని గ్రహించి పండుగను జరుపుకుంటే ఎంతో ఆనందం వస్తుంది.

- వాణిమూర్తి