Others

యమ ‘దారులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన దేశాల జాబితాలో ఏటా లక్షా 50వేల మందిలో భారత్ ప్రథమస్థానంలో ఉండగా రెండుమూడు స్థానాల్లో చైనా, బ్రెజిల్ ఉన్నాయి. రహదారుల నిర్వహణ, సంబంధిత శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ లేక 82 మంది డ్రైవర్లు చెల్లుబాటయే లైసెన్సులున్నవారే వివిధ కారణాలతో ప్రమాదాల బారికి గురి చేస్తున్నారని, దాదాపు 60 శాతం మంది అక్రమ మార్గాలతో లైసెన్స్‌లు పొంది రవాణా నిబంధనల్ని, వాహనాలు నడిపే విషయంలో సరైన అవగాహనా లేమితో తరచు ప్రమాదాల బాటపడి ప్రయాణికులు, తాము అపమృత్యువు పాలవుతున్నారు. రహదారులు రక్తపిపాసతో కోరలు చాస్తూ యువతరం చిధ్రమైపోతున్నారు. అతివేగం అలవికాని అహంభావం, వాహనాల్ని నడుపుతూనే స్మార్ట్ఫోన్‌లతో ఆటలు, ఛేజింగ్, రహదారి నిబంధనల్ని పాటించకుండా ముందువెనకా వచ్చే వాహనాల్ని గురించి పట్టించుకోకుండా, అతివేగంతో ఓవర్‌టేక్ చేయడం నేటి యువతకు ఫ్యాషన్‌గామారి జరగరాని ప్రమాదాలకుగురై తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా కుటుంబాలలోని తల్లిదండ్రులు నిరంతర శోకంతో కునారిల్లుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు నడిపే యువత భవిష్యత్తు గురించి ఆలోచించి వేగం కాదు... వివేకంతో ప్రయాణాలు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు ఉభయ రాష్ట్రాలలోని ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 26 మంది, తెలంగాణాలో 24 మంది రోడ్డుప్రమాదాలలో మృత్యువాత పడుతున్నట్లు అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. ఎంతో దూరదృష్టితో సర్వోన్నత న్యాయస్థానాలు విధిగా శిరస్త్రాణాలను, వాహనాల ప్రయాణంలో సీటు బెల్ట్‌లను ఉపయోగించాలని ఆ ప్రక్రియను కఠినతరంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నా ఆశించిన ఫలితాలు రాబట్టడంలో పోలీసులు, రవాణాశాఖ, అధికారులు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టకపోవడంతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.
బ్రసీలియా ఒడంబడికను అమలు చేయాలి
అవినీతి అరాచకాలకు చిరునామాగా మారిన రవాణాశాఖను ప్రక్షాళితం చేయడానికి ఏళ్ల క్రితమే బిల్లును పెట్టడం జరిగిందని బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొందడానికి ఇంతకాలం పట్టిందని, దేశీయంగా సమర్థ, సుభద్ర అవినీతిరహిత రవాణా వ్యవస్థను రూపొందించడమే బిల్లుపరమోద్దేశమని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఉల్లంఘనుల్ని పసిగట్టడంలోనూ రవాణాశాఖల్లో అవినీతిని అరికట్టి ఆధునిక సాంకేతికతతో వాహనాల సామర్థ్య నిర్ధారణ పరీక్షలూ ఇకపై యాంత్రికంగా సాగిపోనుండడం, లోపభూయిష్ట వాహనాల్ని ఆయా సంస్థలు ఉపసంహరించేలా ఆదేశించే అధికారం కేంద్రానికి దఖలుపరచడం జరుగుతోంది. ఈ విషయంగా రాష్ట్రాల అధికారాలను కబళించే ప్రసక్తి ఏమాత్రం ఉండబోదని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.
రవాణా భద్రతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత నిక్కచ్చిగా వ్యవహరించి, రవాణా రంగానికి మూలకాలైన రహదారులను సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా మలవడం, నిబంధనల్ని త్రోసిరాజంటున్న వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు వాహనచోదకులకు ప్రయాణ ఇంగితజ్ఞానాన్ని పాదుకొల్పి సురక్షితంగా గమ్యంచేరే చైతన్యాన్ని రవాణా శాఖ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా చేపడితే ఆశించిన ఫలితాలు అవంతట అవే చేకూరుతాయి.

- దాసరి కృష్ణారెడ్డి