Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడి రక్తం నా నాడుల్లో ప్రవహిస్తోంది
ఇప్పుడు ఆకాశపు తూర్పుని పరిచయం చేస్తాను
అంచుల్ని తాకే అంబుథుల్ని చూపిస్తాను
మీ జ్ఞాపకాల గవాక్షాల సందుల్లోంచి
ఉద్బుద్ధుమైన ఊపిరి ఉద్రిక్తతల్లోంచి
దీథితుల్ని పెనవేసుకున్న గాలితో
జీవితం శిల్పించేవాళ్ళను నిద్రలేపటానికొచ్చాను
శబ్దంతో
కలల ఖనిజాన్ని కొనితెచ్చాను..
నిశ్శబ్దంగా వున్న శతాబ్దం నిగళాలు తెంచుకోవాలని
కొండలమీంచి లోయల్లోకి జారుతున్న
ఏటవాలు కిరణాలతో ఆడుకోవాలని
మధ్యాహ్నాలు మాట్లాడుకునే నీలి పూల నీడల్లో పడి
దొర్లాలని
శబ్దంలో అధివసించిన సూక్ష్మశక్తికి లొంగిపోయి
నాదంగా
రాగంగా
మారిపోయే చరాచర వస్తుజాలపు వాగ్దానాలుగా
అవతరించాలని
అంతర్లోకాల అనుభూతి చేతనకు ఆకారం దొరకని
ఆనందాన్నననుభవించాలని
పూలు చేసిన తిరుగుబాటులో
పుప్పొడి దుమారం వీచి
ఆత్మ గంధ పక్షాల మీద ఆకాశం నిండిపోవాలని..
సంపెంగ రెక్కల్ని తడిమి
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404