Others

భాద్రపదం.. బహుపుణ్యప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు మాసాల్లో ఆరవ మాసం భాద్రపదం. చాంద్రమానం ప్రకారం పౌర్ణమినాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండే మాసానికి భాద్రపద మాసమని పేరు. వర్షాలు అధికంగా కురిసే మాసం. ఏకాన్న ఆహార వ్రతాచరణ వల్ల ధనం, ఆరోగ్య ప్రాప్తి కలగగలవని విశ్వాసం. భాద్రపద శుక్ల పక్ష విదియ కల్కి జయంతిగా, తృతీయ హరితాళికా వ్రతం, పదహారు కుడుముల తద్దిచేస్తారు. కొందరు సువర్ణగౌరీ, హరితాళికా, షోడశోమా వ్రతాచరణ కూడా చేస్తుంటారు.
మనువులలో నాలుగవ వాడైన తామసమన్వంతరాది. చవితి ఆదిదేవుడైన వినాయక చతుర్థి. భవిష్య పురాణం ప్రకారం పంచమి రజస్వల అజ్ఞాత దోషాల నివారణకై స్ర్తిలు ప్రాయశ్చిత్తానికై రుషి పంచమి వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యపూజకు సూర్య షష్ఠి ఉద్దిష్టమైనదని చతుర్వర్గ చింతామణి, పురుషార్థ చింతామణి, కృత్యసార సముచ్చయములు వివరిస్తున్నాయి. స్కంద దర్శనం చేసుకోవాలని స్మృతి కౌస్త్భుం పేర్కొంటున్నది. మంథా షష్ఠి, దేవీషష్ఠి, లలితాషష్ఠి, చంపాషష్ఠి పేర్లతో వ్రత గ్రంథాలలో ప్రస్తావనలు ఉన్నాయి. లలితా సప్తమిగా అమాదేర్ జ్యోతిషీ, అలంకార పూజ చేయాలని నీలమత పురాణం పేర్కొంటుండగా, ద్వాదశ సప్తమి, అనంతఫల సప్తమి, పుత్రసప్తమి, ఫలసప్తమి, అపరాజితాసప్తమి, మున్నగు వ్రతాలను చతుర్వర్గ చింతామణి పేర్కొంటున్నది.
అష్టమిని శ్రీకృష్ణుని చిత్తాన్ని లయింపచేసి, కృతార్థురాలైన శుభదినం రాధాష్టమిగా, గణేశ చతుర్థి వెళ్ళిన మూడు దినాలకు ఆరంభమై మూడు రోజులు ఉండే గౌరీ పర్వంగా, నవమి దినాన్ని దుర్గా పూజనం చేయాలని స్మృతి కౌస్త్భుం; నందికా నవమీ, గోధుమ నవమీ అని నీలమత పురాణం, శ్రీవృక్ష నవమీవ్రతాన్ని చతుర్వర్గ చింతామణి, అదు:ఖ నవమీ అని ఆమాదేర్ జ్యోతిషీ పేర్కొంటున్నాయి.
దశమి నాడు దశావతారాలను అవతార ప్రతిమలతో పూజించడం, దేవతలకు రుషులకు పితరులకు తర్పణాల్విడం, కృత్యాలుగా చెప్పబడినాయి. ఏకాదశిని పరివర్తినే్యకాదశి అంటారు. విష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించి, రెండు మాసాల అనంతరం ఒత్తిగిలే దినంగా సందర్భంగా పరివర్తినేకాదశి, పార్శ్వ పరివర్తినేకాదశిగా పేరు వచ్చింది. విష్ణువు ఐదవ అవతారమైన వామనునికి ప్రీతి పాత్రమైనదిగా, శ్రవణా నక్షత్రంతో కూడిన శుక్ల ద్వాదశిని వామన జయంతిగా జరుపుకుంటారు.
శ్రవణ ద్వాదశి, వామ ద్వాదశి, విజయ ద్వాదశి అని పిలుస్తారు. అనంత పద్మనాభ చతుర్దశినాడు అనంతుని పూజకు ఉద్దిష్టమైనది. శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసుకోని వారు భాద్రపద పౌర్ణమినాడు యజ్ఞోపవీత ధారణలు గావిస్తారు. ఈనాడు భగవత పురాణాన్ని దానమిస్తే పరమపదం కలుగుతుందని విశ్వాసం. నిష్ఠాపరులు నాందీశ్రాద్ధం. పితృశ్రాద్ధం ఈనాడు విధిగా చేయాలని చెపుతారు. ఉమా మహేశ్వర వ్రతాచరణ కూడా ఉంది. కృష్ణపక్ష ప్రతిపద నుండి మహాలయ పక్షం లేదా పితృపక్షం ప్రారంభం అవుతుంది.
వేదకాలం నుండి ఇది ఆచరణలో ఉంది. బహుళ తదియను ఉండ్రాళ్ళ తద్దిగా తెలుగువారు వ్యవహరిస్తారు. పార్వతి శివుని గూర్చి తపస్సు చేయగా, మహేశ్వరుడు ప్రత్యక్షమైన దినంగా ధర్మసింధువు పేర్కొంటున్నది. పంచమి నాడు నాగపూజ చేయడం, రుషుల పూజనం ద్వారా సప్తర్షుల అగ్రహం పొందడం పేర్కొన బడినాయి. అష్టమి జీమూత వాహన పూజ, నవమి నాడు దుర్గాపూజ, గౌరీపూజలు చేయాలని నీలమత పురాణాధారాలు. ఏకాదశి నాడు ఇంద్రైకాదశిగా, ద్వాదశి నాడు ద్వాపర యుగాదిగా తిథితత్వం, కృష్ణ త్రయోదశి కలియుగాది దినంగా పేర్కొనబడినాయి. చతుర్దశి నాడు మాస శివరాత్రి, మరునాడు మహాలయ అమావాస్యగా జరుపుకోవడం సనాతన సంప్రదాయం.

-సంగనభట్ల రామకిష్టయ్య....9440595494