AADIVAVRAM - Others

స్నేహితులారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అణువంత
అనురాగం కోసం
ఆకాశమంత
ఆరాటంతో అలమటించి
ఓదార్పు కరువై ఒంటరినై
నేనేమిటో నాకే తెలియక
అక్షరాలలో అనే్వషించి
ఆ అక్షరాలతోనే ఆడుకొని
అనుభూతులను ఆస్వాదించి
భావాలకు రూపమిచ్చి
అందమైన పదాలుగా
మీకందిస్తే
అలవికాని అనురాగాన్ని
మీరు చూపిస్తే
అనుభవించిన ఆనందాన్ని
ఎలా తెలుపను?
ఒక్క కన్నీటి చుక్కను
రాల్చడానికి
కోటి కన్నులై నిలిచిన
మీ రుణం
ఎలా తీర్చుకోను?
ఉండిపోనీ
తీరని రుణంగా
మీ శ్వాసలో
అక్షయమవని అక్షరంగా
నా గొంతులో
ప్రాణం వున్నంతవరకూ
అది నన్నొదిలి పోయేంత
వరకూ మిమ్ములను
మరువలేను
అనంత సాగరం మీరు
జీవనదిలా నేను
అలసిపోక
మీకు ప్రేమాభిషేకం చేస్తూ
నిరంతరం
ప్రవహిస్తూంటాను!

- సురేంద్ర రొడ్డ.. 9491523570