AADIVAVRAM - Others

కన్నేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదానమంతా
దుక్కి దున్ని
ఉన్న సారాన్నంతా
పిండేసారు

కొండలూ గుట్టలూ
తొలిచి తొలిచి
నేలమట్టం చేసేశారు

అడవిపై కనే్నశారు
జనం గొంతు పెగలనీయక
ఉన్న ఫలానా ఉరికిస్తున్నారు

ఆ జనమే అడవిని బతికించింది
క్రూర మృగాల మనస్తత్వాన్ని
చదివిన జనం
ముంచుకొస్తున్న ముప్పెనుకున్న
లోతు - తర్జనభర్జన
తెలంగాణొస్తే ఏమొస్తది
ఇల్లు ఇలాకా అడవి
వదిలేసి వెళ్లాల
సమజయ్యిందా!
సముదాయించక ముందే
సర్రున లే త్రాచోలే
గర్జించు పులోలే
నీ తోటి
జంతువులే నీకు స్ఫూర్తి
రక్షణకై వ్యూహరచనకై అవే నీకు
నేర్పిన పాఠాలు
ఏ మైదాన నినాదాన్ని
దరి చేరనీయకు
చిదిమేస్తాయ్ నీకు
తెలియకుండానే

-గిరిప్రసాద్ చెలమల్లు.. 9493388201