Others

నిన్న కనిపించింది (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్న కనిపించింది/ నన్ను మురిపించింది/ అంద చందాల రాణీ ఆ చిన్నది/ ఆమె చిరునవ్వులోనే హాయున్నది
ఇది బిఏయస్ వారి ‘రాణీ రత్నప్రభ’ జానపద చిత్రం కోసం ఆరుద్ర రాసిన పాట. అద్భుత సాహిత్యాన్ని మనసువశం చేసేంత హాయిగా సాలూరి రాజేశ్వరరావు సంగీత స్వరాలు సమకూర్చారు. శ్రావ్యమైన ఘంటసాల గాత్రంలో ఆ పాట అజరామరమైంది. ఎన్‌టి రామారావు, రేలంగి, సీతారామ్, అంజలి, సియస్‌ఆర్‌లపై ఈ పాటను చిత్రీకరించారు.
ఈ పాట సంగీతానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. భీంప్లాస్ రాగంలో సాలూరి రాజేశ్వర రావు పాటకు బాణీ కట్టారు. ఆ రాగంలోని అసలు స్వరాలతోపాటు అన్య స్వరాలనూ విస్తృతంగా వాడుతూ.. అవసరమైన శుద్ధ దైవత్వాన్ని జత చేసి ఖరహరప్రియ రాగ లక్షణాలను జోడించమే కాదు, రంజింపచేసేలా సాలూరు దీనికి బాణీ కట్టారు. దానికి తగ్గట్టుగా ఘంటసాల పాట ఆవిష్కరించిన తీరు రసాత్మకంగా సాగటంతో ఎంతోమంది మన్ననలు అందుకోవటానికి, ఎంతోకాలం మన్నటానికి కావలసిన అర్హతలు ఈ గీతానికి సంతరించుకున్నాయి. మొదటి చరణం ట్యూన్ ఒకలాగ, రెండు మూడు చరణాలు ట్యూన్ మరోలాగ ఉంటుంది. అప్పట్లో కొన్ని పాటలను ఇలాగే ట్యూన్ చేసేవారు సమర్ధత, సత్తావున్న సంగీత దర్శకులు. ఘంటసాల, ఆరుద్రలకు వారి సినీ జీవితంలో ‘మైలురాయి’లో నిలిచిపోయిన గీతమిది!
తొలి చూపులో కలిగే ప్రేమానుభవాలు మదిలో ఎటువంటి భావాలను కలిగిస్తాయో వాటిన్నిటినీ అందమైన తేలికైన మాటలతో విరహ గీతాలుగా రాయడంలో ఆరుద్ర సిద్ధహస్తుడు, ప్రసిద్ధుడని నిరూపించే గీతమిది. నాకు నచ్చిన పాటగా రాస్తున్నా, ఓసారి ఈతరం సంగీతాభిమానులు వింటే అందరికీ నచ్చే పాటే. సినిమా విడుదలై అరవై యేళ్లైనా ఎప్పటికి ఈ పాట వనె్న తగ్గదు!

-పీవీఎస్పీ, అద్దంకి