Others

దృశ్యానంతర దృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడి దృశ్యం
కళ్ళు లేని నదిలా ఉంది!

కొండ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక
చినుకుల స్పర్శతో నవ్విన ఆకాశం
మెరుపులూ ఉరుములూ పిడుగులతో
అకస్మాత్తుగా ఆగ్రహాన్ని ప్రకటించింది!

ఈ శీతవేళ
మనసుకి ఏమైందో ఎవరికి తెలుసు?!

నిజం
నిట్టూర్పు రహస్యం
ఎవరికీ అంతుబట్టదు కదా!

కాలమే
నిశ్శబ్ద వేగంతో
ఆదిమ శ్వాసను వేణువుగా ఊది
పంచభూతాలపై పరుస్తోంది!

మనిషి ఉనికి
ఈ ప్రపంచానికి ఒక లెఖ్ఖా!

తెరచాపని పడవమీద లాగుతూ
జాలరి చూపు
సుదూర తీరాన్ని తాకిపోతోంది!

ఏటిపాట
మనసు అంచును తాకుతూ
భృకుటి ముడివేస్తోంది!

తూరుపు కొండ
కారుమబ్బుల వలస ప్రయాణంతో
చీకట్లో కొట్టుకుపోతోంది!
దిక్కులకి దిమ్మ తిరిగిపోయే
ఈ నిశిరాత్రిలో
ఆకాశానికి దిక్కెవరూ...?!

ప్రవాహంలో
ఒడ్డుకి కొట్టుకొచ్చే కొమ్మల్ని ఏరుకుంటూ
వరద కాలువ హడావిడి చేస్తోంది!

రెప్పలు మధ్య
కొట్టుకులాడే సందర్భం
ఘనీభవించిన ఆఖరి దృశ్యంలా ఉంది!

ఇక భూమి మీద
మనిషి ఆశతో బతుకుతాడో లేదో...

చరిత్ర ఇంకిపోయన కళ్ళకు
వర్తమానం
భవిష్యత్తు చిత్రపటంలా కనిపిస్తోంది!!

- మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910