Others

సొంత విమానంలో ఫ్యాక్టరీకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవునండీ బాబూ! అతను వర్కర్ అండీ బాబూ! ఇంటినుంచి కారులో వెళ్తే 17 నిమిషాలు పడుతోంది. పైగా ట్రాఫిక్ జామ్స్‌లో యిరుక్కుంటే అంతే సంగతులు.
ఐతే జెకొస్లోవేకియాకు చెందిన టెక్నీషియన్ ఫ్రాంటీ సేక్ హద్రావా తన ఆఫీసుకి మరో ఏడు నిమిషాలు ముందే వెళ్లాలనుకున్నాడు. నేలమీదా, రైలుమీదా అయితే ట్రాఫిక్ జంఝాటం. గాలిలోనైతే?
ఒక విమానాన్ని అమెరికన్ మినీ మ్యాక్స్ మోడల్‌లో సొంతంగా తయారుచెయ్యడం మొదలెట్టాడు. ఓ రెండేళ్లు పట్టిందిగానీ, సొంత విమానం రెడీ!
సొంతకారులో ఉద్యోగ ప్రదేశానికి చేరుకుంటేనే- ‘అచ్ఛా!’ పైగా పార్కింగు ప్రోబ్లమ్! గానీ హద్రావా అదృష్టం కొద్దీ ఫ్యాక్టరీ కెదురుగా ఒక మైదానం ఉంది. ఇప్పుడు, రుూ వర్కరు సొంత విమానంలో ఫ్యాక్టరీకి వచ్చి- దాన్ని పార్కు చేసి, దర్జాగా, ఓ ఏడు నిమిషాలు ముందే తన సీటు దగ్గరికి చేరుకుంటున్నాడు. ఈ విమానంలో ఒక్కడికే చోటు. ‘లిఫ్ట్’ అడిగేవాడు లేడు. పైగా ఆకాశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డం రావడం లేదు. ఇంకా నేరుగా ఎగిరితే మరో రెండు మూడు నిమిషాలు కలిసొస్తాయి గానీ జనం రుూ రొదకి గోలెట్టేస్తారు. ఆ మాత్రం సివిక్ సెన్స్ వద్దా మరి? ఈ విమాన నిర్మాణం కోసం రుూ జెక్ వీరుడు నాలుగువేల అమెరికన్ డాలర్లు ఖర్చు- రెండేళ్ల శ్రమ మాత్రం వెచ్చించాడు.