Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గళవిగళిత భావనామయ రజత రేణువుల్ని
వెనె్నల దేవతగా
గంధర్వ శిల్పం మలచిన వాడ్ని..
ఆకులు రాల్చుతున్న చెట్టు కడపటి కొమ్మలోని
చివరి నిశ్వాసం
పరిత్యాగోదయ రమణీయ ప్రతిపాదిక దృశ్యంగా
వసంత ఋతువై దిక్కులు పరుచుకున్న
వాస్తవాన్ని...
నా మాట అడవులకు అలంకారం
నా స్పృహ భూగోళ చైతన్యం
నా రూపు తోటలకు పూవు
నా చూపు గిరిగీసుకున్న దేశ రేఖలకు స్వస్తి
నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిత్యవాసంత సమీరాలు
దేహం చెట్టు
పెరుగుతున్న కొమ్మలు రెమ్మలుప్రయాణ సూచికలు
నన్ను తెలుసుకున్న నేను భూగోళమైన మరుక్షణం
అన్ని జాతులు ఒకే రోజు చేసుకునే
సూర్యదినం ఉగాది
అస్తమయ బాదర బందీలు లేవని తెలుసుకున్న
ఇంద్రియం
పడమటి కొండల్ని పటాపంచలు చేస్తుంది
దిక్కు ఒక్కటే మార్పు, అది నిత్యమాజిష్ఠం
(ఇది సుకవి జన విధేయ సాంధ్యశ్రీ నామధేయ ప్రణీతంబైన ‘సృస్థిల’ ఆధునిక ఇతిహాస ప్రధమాశ్వాసము)
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404