Others

కృష్ణబోధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టిన క్షణంనుంచీ అందరికీ ఏదో ఒక బోధ చేస్తునే ఉన్నాడు. తన చేతల ద్వారా మాటల ద్వారా ఎన్నో సంగతులు మనుష్యులకు చెబుతూనే ఉన్నాడు. కొందరు గ్రహించారు. మరికొందరు గ్రహించినా వూరకున్నారు. గ్రహించలేనివారు గ్రహించిన వారు చెప్పితే విని వాటిని ఆచరించి మరీ ఫలాలు పొందినవారు ఉన్నారు. అర్జునుడిని నెపంగా పెట్టుకుని గీతాబోధ కూడా చేశాడు. ఎందరో రాక్షసులను సంహరించాడు. ఒక్కో రాక్షసుడిని చంపేటప్పుడు ఒక్కోనీతిని బోధించాడు.ఎవరినీ ఎందుకు ఎలా చంపాలో కూడా వివరంగా చేసి చూపాడు.
ఇవన్నీ కలిమాయలు ఎక్కువగా ఉండే కలియుగంలో మానవులు తెలివితోను, ప్రజ్ఞతోను మెలగాలి. ఇన్ని వైరుధ్యాలు కలియుగంలో ఉంటా య అని చెప్పడానికే అన్నిరకాల రాక్షసులను తానే అనేక మాయోపాయాలతో సంహరించాడు.
అంతేకాదు తనను కోరుకున్నవారిని తాను ఎలా రక్షిస్తాడో కూడా చెప్పాడు.
కుచేలోపాఖ్యానంలో కుచేలుడు ఆగర్భ దరిద్రుడు. శ్రీకృష్ణుడు ఆగర్భ శ్రీమంతుడు. కాని వారిద్దరి మధ్య స్నేహం విలువ లెక్కకట్టలేనిది అని అడగకుండానే అనేక వరాలను ఐశ్వర్యాన్ని ఇచ్చాడు.
తననే దైవమని, స్నేహితుడని, బంధువని, చెలికాడని ఎన్నో విధాలుగా నమ్ముకున్న గోపికలను ఎన్నో విధాలుగా కాపాడాడు. వారికందరికీ వారి వారి కోరికలనుసరించి మరుజన్మలను ప్రసాదిం చాడు.
జన్మ అక్కరేనివారికి తన సాయుజ్యాన్ని కూడా ఇచ్చాడు. తనను చూడాలని, తనచేత సన్మానించబడాలని అనుకొంటూనే తనను చూడడా నికి కూడా వీలుండదు కదా అని బాధ పడే కుబ్జ కంసుని దాసి ని తనకై తనే చూసి ఆమె లోని మంచిమనసును గుర్తించి తన చేతితో ముట్టుకుం టూ చుబుకాన్ని లేవనెత్తి ఆమెలోని వంకరలను తీసివేసి అపురూప సౌందర్యవతిని చేశాడు. ఇలా చేయడం వెనుక ఆంతర్యమేమంటారు.
మనిషి లోని అవయవాల వంకర్లు ముఖ్యం కాదు. నాపై భక్తిలో వంకర్లు లేకపోతే అంటే ఆడంబరాలు పైపై మెరుగులు కాకపోతే నేనే మీలోని వంకర్లను తీసేసి మిమ్మల్ని నావారిని చేసుకొంటాను అని చెప్పడమే కదా. అందుకే అంటారు చిత్త శుద్ధి లేని శివపూజలేల?
మనసు, శరీరం రెండూ భగవంతుని అర్పించి తోటివారిని భగవంతుని అంశలుగా భావించి తన పని తాను చేసుకొంటూ ఉన్నాసరే భగవంతుడు అట్లాంటి వారికందరికీ తోడునీడగా నిల్చుని ఉంటాడు. వారు ఎటువంటి ఫరిసిథతుల్లో ఉన్నా సరే వారిపై భగవానుని థయ కురుస్తుంది. వారు నిరాటంకంగా హాయగా జీవించవచ్చు .
‘‘ శాంతియొక్క అన్ని మార్గాలూ మూసివేయబడినప్పుడే యుద్ధం తలపెట్టాలి.కాని మరేవిధంగా కాదు. అంతేకాదు నేను నీలో ఉన్నాను, నీవు నాలో! నీ శత్రువు నా శత్రువు, నీ మిత్రుడు నా మిత్రుడు. నీవు నరుడవు, నేను నారాయణుడను. అవమానపు విషాన్ని మథించి, భవిష్యత్తు కోసం అమృతాన్ని వెలికితీయి!’’ అని అవమాన భారంతో కృంగిపోయే అర్జునుడికి శ్రీకృష్ణుడు హితబోధ చేశాడు.
భగవంతుడిని నమ్ముకున్నవారికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. వారికి అపారమైన అనంతమైన భగవానుని కరుణ అందుతూనే ఉంటుంది.

- వాణిమూర్తి