Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వితీయాశ్వాసము
ప్రకటించిన పాట
పల్లవించిన క్షణం నుంచి చరణాలు కిరణాలతో
కింజిల్కమంతా మధూళి నెత్తిపోసింది
ఉగాది నుంచి ఉగాది వరకు
రోజుల్ని దొర్లించిన భూభృకుటి మీద
ఎవడో
గుడిగంట మోగించాడు
మనిషికోసం మనిషి వెతుకుతున్న కార్యక్రమంగా
స్వప్నాల రేవులు రాత్రిదీపాల నెత్తుతున్నాయి
ఏ కోమలమైన చినుకు స్పర్శకు పులకించిందో
ఈ నేల ఆ పురాగంధ ప్రబంధంలోంచి పుటలు పుటలుగా
తరాలు తన్నుకొస్తున్నాయి
జనంతో అది ఒక మహాసౌందర్య దక్ష
నా నేత్రద్వయం
స్పృశించలేని ఎల్లలు గల అచంచల సర్వంసహా
మొదట నే కాలూనిన మెయి చెక్క ఒక్కటే
నా ఇంద్రియాల గుమ్మం తొక్కిన ఆత్మీయ శ్యామ
నా అంతర్లోకాలలో వేల కోట్ల ధూళి పొరలు
అంతరిక్ష ప్రవాహతరంగాలై
నెత్తురు లెగజిమ్ముతున్నాయి.. కానీ
నా ఆస్వాద జాలంలో చిక్కుకొని
ఆత్మబంధాల్లో లీనమైపోయింది
అర్థానికి అనుభూతికి అభిన్నత
భూమి అనే నా అంతరాత్మ..
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404