Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురిటికేక కవిత్వంగా
పాదాలకు ప్రయాణదాహం పట్టుకుంది
గొంతు విప్పిన మరుక్షణం ఆమని కోకిలగా
అది ఆంతర శ్రోత్రుపర్వం..
బ్రతుకు పరమార్థం ఆనందమైనప్పుడు
మాటల్లో ఇమిడే క్లుప్తతని భరించలేని
ఏ సౌందర్యంలో అది దొరుకుతుందో
అక్కడికే తొలి అడుగు పడుతుంది
నేను వసంత వన జ్వాలని మోస్తున్న
అనిర్వచనీయపు లోతుని
భూమి కనపడకుండా తిరగటంలో
సముద్రాలు గట్టుదాటే స్పృహని కోలుపోయాయి
రాత్రి మైదానాల్లో
మోకరిల్లిన దిగంత రేఖకు అక్షాంశాన్నై
సముద్రాన్నాక్రమిస్తాను, భూమిని కూడా..
చాక్షుష క్రతువనుకొన్న
దృశ్యాలన్నీ తపసు జేస్తున్నాయి
వేల గొంతులేరుకుంటున్న
ఒక్కపాటని వాగాలయంలో ప్రతిష్ఠ చేసిన వాడికోసం
నిరీక్షిస్తున్న సమయంలో
నిశ్శబ్ద ఖనిలో ఆత్మసాహిత్యం
పరమ సూక్ష్మరస లిందు రూపంగా
త్రరుూ భావ్యాన్నై ధర్మ సంగతాన్నై
వాక్యమహార్థాన్నై నేను కనిపించాను..
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404