Others

రక్షణగానూ.. అందంగానూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఎక్కడ చూసినా రకరకాల జ్వరాలు.. డెంగీ అనీ, టైఫాయిడ్ అనీ, మలేరియా అనీ.. ఇలా ఎన్నో రకాలు. వర్షాకాలం-చలికాలం మధ్య దోమల గోలా, అవి తెచ్చి పెట్టే జ్వరాల బాధ అంతా ఇంతా కాదు. కిటికీలకు, గుమ్మాలకు నెట్‌లు పెట్టించినా, మస్కిటో కాయిల్స్ పెట్టుకున్నా, ఎలక్ట్రిక్ బ్యాట్‌తో కొట్టినా ఎప్పుడో ఒకప్పుడు ఒకటో, రెండో దోమలు దుప్పట్లోకి దూరి మరీ కుడుతుంటాయి. ఆ బాధ పడలేక నానా ఇబ్బందులు పడుతుంటారు గృహిణులు. అలాగని దోమతెరలు వాడాలంటే అవి బాగుండవని, ఇంటి ఇంటీరియర్‌కు సరిపడవని చాలామంది ఇష్టపడరు. ఇంతకు మునుపు దోమతెర వేయాలంటే పందిరిమంచాలకు మాత్రమే ఆ వెసులుబాటు ఉండేది. రానురాను పందిరి మంచాల వాడకం తగ్గిపోవడంతో చాలామంది దోమతెరల మాటే మర్చిపోయారు. దోమలతో పాట్లు పడుతున్నా వారికి దోమతెరలు మాత్రం గుర్తుకు రావడం లేదు. కారణం అవి వేస్తే మంచాలకి, గదికి అందం రాదని వారి ఫీలింగ్. ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల దోమతెరలు వచ్చేశాయి. ఒకప్పుడు దోమతెరలన్నీ నెట్‌క్లాత్‌తోనూ, అదీ కేవలం తెలుపు రంగుతో మాత్రమే ఇవి దొరికేవి. కానీ ఇప్పుడు మంచం చుట్టూ ఉండే రెయిలింగ్‌తో సహా పరదాలు దొరుకుతున్నాయి. అల్యూమినియంతో తయారయ్యే ఈ రెయిల్స్ లేదా రాడ్స్‌ను స్క్రూల సాయంతో ఎవరికి వాళ్లు మంచానికి బిగించుకుని పరదాల్ని తగిలించుకోవచ్చు. కర్టెన్స్ మాదిరిగానే దోమతెరల ఫ్యాబ్రిక్కులకు కూడా లేసును జోడించి రకరకాల డిజైన్లలో కుట్టేస్తున్నారు డిజైనర్లు. రంగులకైతే లెక్కేలేదు. పైగా దోమతెరలను వేసుకునే బెడ్‌షీట్స్‌కి, రూము రంగులకి మ్యాచ్ అయ్యేలా అందంగా రూపొందిస్తున్నారు. పరదాలని తగిలించే రెయిల్స్‌ని సైతం రకరకాల ఆకారాల్లో చేస్తున్నారు. కొన్ని మంచానికి నలువైపులా ఉంటే, మరికొన్నింటికి రెండు రాడ్స్ మాత్రమే ఉండి, పైన మాత్రం నలువైపులా చుట్టినట్లుగా ఫ్రేమ్ ఉంటుంది. ఇంకొన్ని నెట్స్‌ని రెయిల్ అవసరం లేకుండా పైన హుక్‌కి తగిలించేలా గుండ్రని ఫ్రేమ్‌తో చేస్తున్నారు. ఈ సెట్‌ని యథాతథంగా హుక్‌కి తగిలిస్తే చాలు.. సాదా బెడ్ కాస్తా జానపద కథల్లోని రాజకుమారి బెడ్‌లా మారిపోతుంది. ఫెయిరీటేల్ కథల్లోని రాజకుమారిలా కనిపించేలా అమ్మాయిల బెడ్‌కి జాలువారే పరదాలని తగిలిస్తున్నారు నేటి గృహిణులు. వీటివల్ల అంతఃపుర కాంత జలతారు పరదాల్ని తలపిస్తోన్న ఈ దోమతెరలు అటు బెడ్‌తో పాటు ఇటు గదికీ చూడచక్కని అందాన్ని ఇస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఒక్కదోమ కూడా లోపలకు రాకుండా ఉంటాయి. ఇంటికి కిటికీలు, కిటికీలకు పరదాలు ఎంత అవసరమో.. మంచానికి దోమతెర కూడా అవసరం. అప్పుడే మనుషులు ఎలాంటి జ్వరాల, జబ్బుల బారిన పడకుండా ఉంటారు. అయితే ఆ తెర ఒక అందమైన పరదాలా ఉంటే ఆ బెడ్ లుక్కే మారిపోతుంది. బెడ్‌తో పాటు గది రూపం కూడా మారిపోతుంది అంటున్నారు ఆధునిక ఇంటీరియర్స్. అందుకే సాదాసీదా దోమతెరలన్నీ అందాల పరదాల్లా సరికొత్త సొగసుల్ని అద్దుకుని ఫ్రేమ్‌తో సహా మార్కెట్లో దొరుకుతున్నాయి.