Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రతో సముద్రాన్నీదుతూ నేనున్నాను
భుజాన ‘ఎడవల’తో...
అలల మీద తేలుతూ కలల చేపలు కవ్విస్తుంటే
నా ఆత్మ
నా శరీరాన్ని
రంగులు విరిసే సమస్త వస్తుజాల ఆంతరిక రహస్యంగా
అవతరింపచేసింది
ఱెప్పలు మూసిన నిశ్శబ్దం వెలిగించిన
ఊపిరి దీపానికి స్వప్నాల దారులు సుస్పష్టమే
మెలకువ కాని మెలకువని
మనసు కతికించిన మంత్రనగరి పొలిమేర
అవలీలగా నన్ను ఆక్రమించుకుంది..
నిశ్శబ్దం అడుగులమీద నిన్నటి జ్ఞాపకమంతా నడిచివస్తోంది
అరవింద పత్రంమీది అంచుకణం లాంటి వర్తమానం
గాలి బుడగలాంటి భవిష్యపురాణాన్ని
ప్రవచిస్తోంది శబ్దాల్లో నలిగిపోతున్న సజీవ వాస్తవం
నా గాత్రాదధిలో సేద తీరుతుంది...
నా ఆత్మ
నా శరీరాన్ని రంగులు విరిసే
సమస్త వస్తుజాల ఆంతరిక రహస్యంగా
అవతరింపచేసింది..
‘‘పువ్వు
పక్షి రంగు రాగము
అన్నీ నా సుశిక్షిత నేత్రానికి
ఒక్క వస్తువు రూపాంతరాలే’’..
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404