Others

కృష్ణభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చైతన్యుడు. క్రీ.శ.1485 ఫిబ్రవరి నెలలో పూర్ణిమనాడు బెంగాలు దేశానికి చెందిన నవద్వీపం అనే గ్రామంలో సుప్రసిద్ధ పండిత వంశంలో జన్మించాడు. చైతన్యుడు ప్రభవించిన సమయం సరిగ్గా చంద్రగ్రహణం కావడంతో ఆ దినం చాలా శుభప్రదమైనదిగాకాలం అని అపుడు పుట్టిన చైతన్యుడు కూడా రాహువును వదిలించుకుని చంద్రుడు ఎలాగైతే దేదీప్యమానమైన వెలుగులను చల్లగా ప్రసరిస్తాడో అట్లానే ఆయన కూడా వెలుగులను పంచుతాడని వారింట అందరూ అనుకొన్నారు.
వారికోరికలను అనుసరించే చైతన్యుని వయస్సుతో పాటుగా కృష్ణ్భక్తి పెరుగసాగింది.
ఓసారి దేవుడ్ని దర్శించుకోవాలని గయలో విష్ణాలయానికి వెళ్ళాడాయన. విచిత్రంగా అప్పటికప్పుడు చైతన్యుడి హృదయం భగవదర్పితమై పోయింది. భగవత్కారుణ్యమనే చల్లనివాయువులు వీచగానే కృష్ణ భక్తుడైపోయాడు. ఐహిక వాంఛలకు దూరమయ్యాడు...
అప్పట్నుంచి అందరూ ఆయన్ను కృష్ణ్భక్తుడిగా భావించి ఆరాధించేవారు. ఆయన దగ్గర కొచ్చిన అందరూ కృష్ణ్భక్తులుగా మారిపోయేవారు. వారిలో లేశమాత్రమైన అనుమానాలు ఉండేవి కావు. అందరూ దేవదేవుడైన కృష్ణ దర్శనం ఫొందేవారు. తిరిగి పొందుతామన్న నిశ్చలమైన మనస్సుతో తిరిగి వెళ్లేవారు.
కొంతమందైతే చైతన్యుడిని సాక్షాత్తూ శ్రీకృష్ణ్భగవానుని అవతారంగా భావించి కొలవడం మొదలుపెట్టారు. అయితే ఇందుకు చైతన్యుడు ఎన్నడూ అంగీకరించలేదు. తాను కేవలం భగవంతుడి భక్తుడిని, బోధకుడిని మాత్రమేననీచెప్తుండేవారు. ‘కృష్ణ నామం జపించండి... కృష్ణుని భక్తులు కండి... కృష్ణుడినే తప్ప మరొకరిని గురించి ఆలోచించకండి. కృష్ణుని గూర్చి ఆడండి, పాడండి...’ అని అనుక్షణం భక్తులకు హితబోధ చేస్తూ ఆయన నిరంతరమూ కృష్ణనామామృత పానంలో మునిగి ఉండేవాడు.
కొన్నాళ్లతరువాత చైతన్యుడు పాదచారియై దేశంలోని ప్రతి దేవాలయాన్నీ సందర్శిస్తూ, కృష్ణగానం గావిస్తూ వెళ్ళినచోటల్లా కుల మతాలకు అతీతంగా కృష్ణ భక్తిని వ్యాప్తి చేయడానికి బయలుదేరాడు. అలా యాత్రలు చేస్తూనే తన శిష్యులకు శిక్షణ గరపటం చేసేవాడు. ఆ శిష్యులలో అద్వైతానంద, నిత్యానంద అనువారు అచంచలమైన భక్తివిశ్వాసాలు చూపుతూ చైతన్యుడిని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు.
చైతన్యుని భక్తుడు నిత్యానందుడనే వాడు కూడా చైతన్య మహాప్రభువే కృష్ణునిగా నమ్మేవాడు. నిరంతరం చైతన్యునితో పాటు ఉంటూ ఆయన చెప్పిన బోధనలన్నీ విశ్వవ్యాప్తం చేయాలనే పట్ట్దుదలతో పని చేసేవాడు. చైతన్యుడు ప్రసాదించిన ‘‘హరేకృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే - హరే రామ హరే రామ రామరామ హరే హరే’’అనే మంత్ర బలంతో ప్రపంచ దేశాలకు కృష్ణ సందేశాన్నీ, భక్తినీ పంచుతూ ఉండేవాడు.
నేటికీ చైతన్య మహాప్రభు భక్తులు కృష్ణ్భక్తుల పేరిట కృష్ణనామాన్ని స్మరణ చేస్తూనే ఉంటారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు