Others

మహిళా సాధికారతకు లింగవివక్షే అవరోధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల సంక్షేమానికి ఎన్ని చట్టాలు చేసినా భారతీయ సమాజంలో అనాదిగా కొనసాగుతున్న లింగవివక్ష వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని సీనియర్ ఐపిఎస్ అధికారిణి అర్చన రామసుందరం (58) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో పారా మిలటరీ బలగాల్లో ఒకటైన ‘సశస్త్ర సీమా బల్’ (ఎస్‌ఎస్‌బి) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె- ‘లింగవివక్ష అంతం కానిదే మహిళా సాధికారత సాధ్యం కాద’ని చెబుతుంటారు. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) స్పెషల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆమె పారా మిలటరీ బలగాల్లో తొలి మహిళా చీఫ్‌గా ఇపుడు గుర్తింపు పొందారు. తమిళనాడు కేడర్‌కు చెందిన అర్చనను గతంలో సిబిఐ అదనపు డైరెక్టర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. సిబిఐలో ఆమె ను నియమించడాన్ని సవా ల్ చేస్తూ అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఫలితంగా ఆమెను ఎన్‌సిఆర్‌బి స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1980 ఐపిఎస్ బ్యాచ్‌కి చెందిన ఆమె ‘సశస్త్ర సీమా బల్’ డైరెక్టర్ జనరల్ పదవిలో వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఉంటారు. దేశ భద్రతకు సంబంధించి సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బి, సిఐఎస్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ అనే అయిదు పారా మిలటరీ బలగాలు పనిచేస్తుంటాయి. నేపాల్- భూటాన్ సరిహద్దుల్లో దేశ రక్షణలో సేవలందించే ‘సశస్త్ర సైమా బల్’కు ఇక అర్చన నాయకత్వం వహిస్తారు.
సమాజం వైఖరి మారాలి..
మన దేశంలో ఇప్పటికీ మెజారిటీ శాతం మహిళలు పేదరికం, అనారోగ్యం, అనాగరిక ఆచారాలు, లింగవివక్ష, హింసను ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను అధిగమించాలంటే ముందుగా స్ర్తిల పట్ల సమాజం వైఖరిలో మార్పు రావాలని అర్చన చెబుతుంటారు. మహిళల స్థితిగతుల గురించి అనునిత్యం ఆలోచించే ఆమె ఉన్నత చదువులు పూర్తి చేశాక ఐపిఎస్ వైపు మొగ్గు చూపారు. పోలీస్ శాఖను ఇష్టమైన కెరీర్‌గా అర్చన ఎంచుకోవడం ఆమె కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను విస్మయానికి గురిచేసింది. ఏ హోదాలో పనిచేసినా మహిళల పట్ల హింసను తగ్గించేందుకు ఆమె తన పరిధిలో కృషిచేశారు. చట్టాలు, వాటిని ఆశ్రయించాల్సిన పద్ధతులపై మహిళలకు తగినంత అవగాహన కల్పించాలని ఆమె చెబుతుంటారు. భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వాన్ని ప్రసాదించినప్పటికీ వారు ఇప్పటికీ లింగ వివక్షకు గురవుతున్నారని ఆమె అంటారు. ఉన్నత విద్య, ఉపాధి రంగాల్లో మహిళలు మరింతగా దూసుకుపోతేనే అభివృద్ధి ఫలాలు వారికి అందుతాయని అర్చన చెబుతుంటారు. బాధిత మహిళలకు తగిన న్యాయం చేయాలంటే పోలీసు అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, నేర పరిశోధనలో నిజాయితీగా ఉండాలని ఆమె హితవు చెబుతుంటారు. స్థానిక సంస్థల్లో మూడింట ఒక శాతం పదవులను స్ర్తిలకు కేటాయించినా, చట్టసభల్లో 33 శాతం సీట్లను కేటాయించాలంటే ‘మహిళా బిల్లు’కు ఎప్పటికైనా మోక్షం కలిగించాలని అంటా రు. అత్యాచారాలు, గృహహింస నిరోధానికి కొత్త చట్టా లు అమలులోకి వచ్చినా మహిళల పట్ల లైంగిక నేరాలు, కట్నం వేధింపులు తగ్గలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, అక్రమ గర్భస్రావాలు ఇంకా జరుగుతున్నాయంటే ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా తగ్గలేదని ఆమె గుర్తు చేస్తుంటారు. అత్యాచారాలు, లైంగిక నేరాలు, కట్నం చావుల సంఖ్య ఆందోళనకరంగానే ఉందని ఎన్‌సిఆర్‌బి స్పెషల్ డైరెక్టర్‌గా ఆమె తన అనుభవాలు వివరిస్తున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక కట్టుబాట్ల కారణంగా మహిళలు సాధికారతను సాధించలేకపోతున్నారని ఆమె విశే్లషిస్తున్నారు. గ్రామీణ, నిమ్నకులాల స్ర్తిల పరిస్థితిలో ఆశించిన మార్పు ఇంకా రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆమె చెబుతుంటారు. మహిళల పట్ల హింస తీవ్రస్థాయిలో ఉన్నా చట్టాలు, సంక్షేమ పథకాలు కొరగాకుండా పోతున్నాయని, పోలీస్ శాఖలోనూ పురుషాధిక్య భావజాలం ఇంకా కొనసాగుతోందని అర్చన చెబుతుంటారు. పని ఒత్తిడి కారణంగా సామాజిక అంశాలపై పోలీసు ఉద్యోగులు దృష్టి సారించే పరిస్థితి లేదంటున్నారు. తన ఇరవై రెండేళ్ల కెరీర్‌లో బాధిత మహిళల సంక్షేమానికి ఎంతోకొంత కృషిచేశానన్న ఆత్మసంతృప్తి ఉందని అర్చన అంటారు. మహిళల పట్ల హింసను తగ్గించడం ఒక్కటే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత కాకపోయినా, సామాజిక స్పృహతో పనిచేసి స్ర్తిల సంక్షేమానికి కృషి చేయడం కష్టసాధ్యం కాదని ఆమె చెబుతుంటారు.
*