Others

పురిటిగది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నట్టింట
చిలుకుతున్న
పాడికుండ చుట్టూ
చెల్లాచెదురైన చల్ల చినుకులల్లే -

పరుచుకున్న
నీలాకాశ వస్తమ్రీద
చుక్కల వడియాలు ఆరబెట్టినట్టు -

కొత్త నీటికెదురెక్కి
మా చెరువులో
పిత్తపరిగ లెగిరి గంతేసినట్టు -

పితుకుతున్న
పొదుగునుండి
పాత్రలోకి పరుగులు తీసే
పాలధార్ల ఝరి శ్రావ్యమైన చిరు శబ్దమల్లె -

ఎండుటాకుల్నొదిలి
కొత్త చివుళ్ళ పసిమొగ్గల్నెత్తుకుని
ఓలలాడించే కొమ్మా; రెమ్మలల్లె -
చిగురించి, ప్రవహించి
నర్తించి, పులకిస్తోంది
నా మది
కొత్త కవితలకు జన్మనిచ్చే పురిటిగది.

- మోకా రత్నరాజు 9989014767