Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుప్పొడి పూసుకుని ఎగురుతున్న గాలిని
బంధించాలని తోట పరిమళ ప్రయత్నం చేసినా
నలుదిక్కులనుండి ముసురుకొస్తున్న
కొత్తగాలుల చాళ్ళలోంచి పాటల పుట్టుకొస్తున్నాయి..
ఎవరి కౌగిలింతలో ఈ బాహ్యశరీరాన్ని కోల్పోయానో
అక్కడ భావతరంగాల బంధుత్వ భాష
పూల రేకులు పరుస్తోంది...
***
మధుమాసంలో మాకందారోహకమై
బ్రతుకులో జలకాలాడిన క్షణాలన్నీ
కోకిల కూర్చున్న కొమ్మలై
పూలేరుకుంటున్న గాలి చేతులై..
ఆత్మాగ్నుల్లోకి దూకి తప్త హిరణ్యంలా మారిపోయిన
ఒక్కొక్క శబ్దం
అనుభూతుల ఉష్ణోగ్రతను పుక్కిలిస్తుంటే
నేను నన్ను వదిలి మరొకరిలో లీనమైపోదామంటే
నాలో లీనమయ్యే మరొకరేరి..?
వెతుకుతున్నాను
ఏ ఉదయించే ఉషస్తార
ఏ క్షణాన నన్ను పొదువుకుంటుందో
ఆ క్షణాల సామీప్యంగా
వలయ కేంద్రంలో నిలబడి
వెతుకుతున్నాను..
మారుతున్న దృశ్యాల మార్మిక చేతనా నిరవధికత్వంలో
నా తను తరువుమీద రంగులు, రాగాలు..

ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404