Others

సిరులిచ్చు తల్లి శ్రీమహాలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రమహాభాగవతంలో శ్రీమహాలక్ష్మిని మనోజ్ఞంగా వర్ణించారు సహజకవి బమ్మెరవారు.
మ. హరికింబట్టపుదేవి -పునె్నముల ప్రవర్థంబుబెన్నిక్కచం
దురుదో బుట్టువు భారతీ - గిరి సుతల్ తో నాడు పూబోడి, తా
మరలందుండె డి ముద్దురాలు -జగముల్ మన్నించు యిల్లాలు -్భ
సురతన్ లేములు వాపు దల్లి -సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్
అంటూ లక్ష్మీదేవి శ్రీహరికి పట్టపురాణియని, పుణ్యాలను ప్రసాదించు తల్లియనీ, క్షీర సాగర మధన వేళ ఉద్భవించి చంద్రునికి తోబుట్టువుగా ఉందనీ, త్రిమూర్తులలో బ్రహ్మా ఇల్లాలు భారతికి, గిరి సుత పార్వతీ దేవి వీరితో పాటు నిత్యం విలసిల్లే సుకుమారియనీ, సౌందర్యం, సుకుమారం సంతరించుకున్న దృక్కులతో కరుణించే ఇల్లాలనీ, పేదరికాన్ని ఎడబాపి సిరులనందించే తల్లియనీ నిత్య కల్యాణాలు ప్రసాదించే జగదంబ యనీ పోతనామాత్యులు వర్ణించారు.
యోగ సిద్ధి కారణమున పలురూపాలలో విలసిల్లే పరమ శుద్ధ సత్త్వస్వరూప, సకల సౌభాగ్యములతో సంపన్నురాలైన మహాలక్ష్మి నామంతో ప్రసిద్ధురాలైనదీ. ప్రేమభావంతో సమస్త నారీ సమూహమునందు ప్రధానమైన ప్రకాశించే తల్లి మహాలక్ష్మి. ఇంద్రుని ఐశ్వర్యంతో సమమైన సుందర విగ్రహమును ధరించి స్వర్గలక్ష్మిగా స్వర్గంలో ఉంటుంది. పాతాళలోకంలో నాగలక్ష్మిగా ఆరాధనలందుకుంటున్నది.
రాజుల వల్ల రాజ్యలక్ష్మిగా, గృహస్థుల ఇంట గృహలక్ష్మిగా పూజితురాలవుతూ ఉంటుంది. ఈ రూపాలన్నీ మహాలక్ష్మివే. మహాలక్ష్మిలోని అంశమాత్రములే ఈ రూపాలని దేవీ భాగవతం తెల్పింది. పూర్ణరూపంలో నిత్యం ఆ వైకుంఠుని దగ్గరే ఉంటుంది.సకల మంగళమును ప్రసాదిస్తూ సంపద స్వరూపిణిగాగోవులలో సురభిరూపంలోను, యజ్ఞములందు దక్షిణరూపంలో ఈ తల్లి విలసిల్లుతూ ఉంటుంది. క్షీరసాగరానికి పుత్రికయైనది కమలముల యందు శ్రీ రూపంగా చంద్రుని అందు శోభ రూపంగా ప్రకాశిస్తున్నది.
మొదట భగవంతుడైన నారాయణుడు వైకుంఠంలో శ్రీమహాలక్ష్మిని పూజించాడు. రెండవ సారి బ్రహ్మభక్తితో అర్చించాడు. మూడవ సారి పరమ శివుడు పూజించాడు. ఈమె సకలైశ్వర్యాలకు అధిష్ఠాత్రీదేవి. సత్యశివుడు ఉపాసించేడు. ఈమె సకలైశ్వర్యములకు అధిష్ఠాత్రీదేవి. సత్య సనాతని. పూర్వకాలంలో నారాయణుని వచనమును సత్యమొనరించుటకు ఈ దేవి భూలోకంలో సముద్రుని కన్యగా అవతరించునదిసర్వ సంపత్తి స్వరూప రూపయగు లక్ష్మి తన కళచేసేముద్రునికి పుత్రిక అయినది. శరన్నవరాత్రుల్లో కూడా శ్రీ మహాలక్ష్మిదేవిని నవదుర్గల్లో ఒక దుర్గగా ఆరాధించుతారు.

-పి.వి.సీతారామమూర్తి 9490386015