AADIVAVRAM - Others

పదాల్లో పోలిక.. రోగాల్లో తేడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లీషులో ఇనె్ఫక్షస్, కంటేజియస్ అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియానువల్ల కాని, వైరస్ వల్ల కాని, బేక్టీరియం వల్ల కాని, ఫంగస్‌వల్ల కాని, పేరసైట్‌వల్ల కాని వచ్చే రోగాలని ‘‘ఇనె్ఫక్షన్ డిసీజెస్’’అంటారు. అంటే, మన శరీరానికి ‘స్వంతం’కాని లాటి పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు ‘ఇనె్ఫక్షన్’ అన్న మాట వాడతాం. ఒక జీవినుండి మరొక జీవికి అంటుకునే రోగాలని ‘‘కంటేజియస్ డిసీజెస్’’అని కాని, ‘‘కమ్యూనికబుల్ డిసీజెస్’’అని కాని, ‘ట్రాన్స్‌మిసిబుల్ డిసీజెస్’ అని కాని అంటారు.
‘‘సి.జె.డి.’’అనే జబ్బు ఉంది. ఇది ప్రియానులు మన శరీరంలో జొరబడ్డంవల్ల వస్తుంది. కాని ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకోదు. అంటే ఈ ‘‘సి.జె.డి.’’ జబ్బుతో తీసుకుంటూన్న వ్యక్తి దరిదాపుల్లోకి వెళ్లినంతమాత్రాన ఆ జబ్బు మనకి అంటుకోదు. కనుక ఇది ‘‘ఇనె్ఫక్షన్ డిసీజ్’’మాత్రమే. దోమకాటువల్ల మనకి సంక్రమించే మలేరియా వంటి రోగం కూడ ‘‘ఇనె్ఫక్షన్ డిసీజ్’’ కోవకే చెందుతుంది.
కాని మలేరియా కేవలం ఒకరిలో తిష్టవేసుకుని ఉండిపోదు కదా. మలేరియా ఉన్న రోగిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే ఆ రెండవ వ్యక్తికి మలేరియా వచ్చే సావకాశం ఉంది. ఈ దృష్టితోచూస్తే మలేరియాని ‘‘కంటేజియస్’’అని అనుకోవచ్చు. కాని ఈ సందర్భంలో అలా అనం. ఈ వ్యత్యాసం ఇన్‌ఫ్లుయెంజా విషయంలో స్ఫుటంగా కనిపిస్తుంది. ఇన్‌ఫ్లుయెంజా లేదా ఫ్లుఇన్ఫ్‌క్షన్ మాత్రమే కాకుండా కంటేజియస్ కూడా! ఎందుకంటే ఒకరికి ఫ్లూవస్తే వారికి సమీపంలోఉన్న మరొకరికిగాని, వారిని తాకిన వారికి గాని అంటుకునే సావకాశం బాగా ఉంది. కనుక ఈ రెండురకాల రోగాల మధ్య ఒక గీత గీసి ఒక పక్క ఇనె్ఫక్షన్ మరొక పక్క కంటేజియస్ అని చెప్పటం కొంచెం కష్టం. ఇనె్ఫక్షన్‌లు ఎన్నో విధాలుగా రావచ్చు, కాని అన్ని ఇనె్ఫక్షన్‌లూ ఒకరినుండి మరొకరికి అంటుకోవు. మరొక విధంగా చెప్పాలంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి అక్కడ తిష్టవేస్తే అది ‘తిష్ట’(లేదా ఇనె్ఫక్షన్), దాని వల్ల వచ్చే రోగం తిష్టరోగం. ఈ రోగం ఒకరి నుండి మరొకరికి అంటుకుంటే అది ‘అంటు’(లేదా కంటేజియస్), దానివల్ల వచ్చే రోగం అంటురోగం. ఇప్పుడు తిష్టతత్త్వం అంటే ఇనె్ఫక్షన్, అంటుతత్త్వం అంటే కంటేజియస్ అని మనం తెలుగులో వాడుకోవచ్చు.
కంటేజియస్ అనే విశేషణానికి నా నిఘంటువులో ‘‘అం టు, సోకుడు, సంక్రామిక, సాంక్రామిక’’అనే అర్థాలు కూడ ఇచ్చేను. ఇనె్ఫక్షన్ అంటే ‘‘తిష్ట, సంక్రామిక’’ అని ఇచ్చేను. నిఘంటు నిర్మాణంలో కొన్ని ఇబ్బందులవల్ల ‘‘సంక్రామిక’’అనే అర్థం రెండింటికీ ఇవ్వవలసి వచ్చింది. కాని ఇక్కడ ఈ మాటల అర్థాలలోని తేడా వివరించేను కనుక వీటి అర్థాలలో విభేదం చూపించగలిగేను.
తిష్టతత్త్వం గురించి మరికొంచెం తెలుసుకుందాం. తిష్టకి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవలసినవి బేక్టీరియంలు, వైరసులు. ఉదాహరణకి క్షయ బేక్టీరియంవల్ల వచ్చేది తిష్టవ్యాధి. జలుబు, ఆటలమ్మ, మశూచికం, ‘‘ఎ.ఐ.డి.ఎస్’’ మొదలైనవి వైరస్‌వల్లవచ్చే తిష్టవ్యాధులు.
బేక్టీరియం అతి సూక్ష్మమైన ఏక కణ జీవి. ఈ జీవులు అనేక రకములైన వాతావరణాల్లో స్వతంత్రంగా బతకగలవు. వైరస్ ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన ‘‘విష రేణువు.’’ ఈ రేణువులు (విషాణువులు) స్వతంత్ర ప్రతిపత్తితో బతకలేవు. అంటే వీటికి ఆతిథ్యం ఇవ్వటానికి ఒక అభ్యాగతి ఉండాలి. అందుకనే ఇవి మొక్కలలోకో, జంతువులలోకో, మనుష్యులలోకో ప్రవేశించిన తరువాతే వృద్ధిచెంది హానిచేస్తాయి. సామాన్యులకి ఈ సూక్ష్మాలు అన్నీ అనవసరం. మనం అంతా గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే పెనిసిలిన్ వంటి ‘‘ఏంటీ బయాటిక్’’లు బేక్టీరియంల మీదనే పనిచెయ్యగలవుకాని, వైరస్‌ల మీద వాటికి ఏవిధమైన ప్రభావమూ లేదు. కనుక వైరస్‌వల్ల వచ్చే జలుబు, ఫ్లూవంటి వ్యాధులకి పెనిసిలిన్ వంటి ఏంటీబయాటిక్ మందులు వేసుకోవటంవల్ల ప్రయోజనం ఏమీ లేదు; పైపెచ్చు చీటికీ, మాటికీ పెనిసిలిన్ వంటి ఏంటీబయోటిక్ మందులు వాడడం మంచిది కూడా కాదు. అలావాడితే వాటికి శరీరం అలవాటుపడిపోయి నిజంగా అవసరం వచ్చినప్పుడు ఆ మందులు వాడితే అవి పని చెయ్యవు.

-వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా