Others

నీతో ప్రతిక్షణం (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతో ప్రతిక్షణం ఓహో/ ఎంతో మనోహరం ఓహో -అంటూ ప్రారంభమై నడిచే ప్రతి బాట/ నడపాలి మనవెంట బ్రహ్మోత్సవం’ అనే పల్లవితో సాగే బ్రహ్మోత్సవం చిత్రంలోని టైటిల్ సాంగ్ ఎంతో అర్ధవంతంగా హృదయాన్ని తాకుతుంది. పాటలోని ప్రతి పదం ఓ అద్భుతం. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ కలం పదును, మిక్కీ జే మేయర్ బాణీ, మైనంపాటి శ్రీరామచంద్ర వాణి త్రివేణీ సంగమంలా సాగి శ్రోతల్ని ఓలలాడిస్తాయి. ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలన్పించే సంగీతం బీట్‌తో సాగుతుందీ పాట. ‘నిత్యమూ మనతో మనకే రణం/ ఎప్పుడూ ఏదో ఓ కారణం’ అలాగే ‘ఎన్నడో వెనకటి జన్మల ఋణం/ తీర్చుకోవాలనిపించే తనం’ అంటూ సాగే చరణాలు మానవ సంబంధాల్ని తట్టిలేపుతాయి. 2016 మే 20న విడుదలైన ఈ సినిమా ఫలితం విషయం పక్కనబెడితే -పాటలన్నీ జీవితాన్ని కాచి వడబోసేవే. అందులో ‘ఆణిముత్యం’ ఈ పాట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వ ప్రతిభ, ప్రసాద్ వి పొట్లూరి వంటి అభిరుచిగల నిర్మాత, మహేష్‌బాబు, కాజల్ అగర్వాల్, సమంతల స్క్రీన్ ప్రెజెన్స్ పాటను పది కాలాలపాటు నిలబెట్టగలిగాయి. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేంత ఇష్టం ఈ పాటంటే. ఈ పాట స్ఫూర్తితో పాతికేళ్లనాడు డిగ్రీ నాతో కలిసి చదువుకొన్న మిత్రులందరినీ వెదికిపట్టుకొని 2018లో ‘గెట్ టుగెదర్’ చేశాను కావలి జవహర్ భారతి కళాశాలలో. అమెరికా, సౌతాఫిక్రావంటి దేశాల నుండి, వివిధ రాష్ట్రాలనుండి కూడా మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని గెట్ టుగెదర్‌లు చేసే పనిలో ఉన్నాం, మిత్రులంతా.

-కె విజయచంద్ర, కావలి