Others

సృస్థిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నులి కాక గాలితో కలసివచ్చె
కబురుటెండల కింక కాయిదా చెల్లగా
చెట్టు నీడకు చేరె చెలిమిజంట
పచ్చి మామిడి కాయ పలక మారినదేమొ
పండు రుచులు కొన్ని దండుకొనియె
నిన్న నేటికి ఇణతలో నెంత మార్పు
పొట్టి పొడుగయ్యె పొడుగేమొ పొట్టిదయ్యె
పగలు గదిమిన రేయిని సెగలు మూసె
రాత్రి గదిమిన పగలెంత రచ్చజేసె...
తూర్పులో నొక మబ్బు తొంగి చూచిన వేళ
వెలుగు వాకిలి ముందు జిలుగు మాపు
కుడివైపునొక మబ్బు గొడుగెత్తి విరివాఱ
చినుకు సందడి జోక చెలిమి కోపు
పడమట నొక మబ్బు పయికొని ప్రాకగా
హరివిల్లు వంపులో అనుగుతూపు
ఎడప్రక్కనొక మబ్బు ఎకదొట్టి రేగగా
గగనంపు వీధిలో గంగ మెఱుపు
తలపునావిరి పట్టిన దర్దురమ్ము
వలపు తలకెక్కి కురిసిన వారి క్రతువు
నిదురబోయెడు కోర్కుల మృదుకవాట
వాటములు తట్టి పిల్చిన వర్షఋతువు

ఇరుప్రక్క లేకమా ఇంగిలీ కపు రంగు
కిరణ సంస్పర్శచే కేరుచుండె
నిర్మలాకాశంపు నీలాటి రేవులో
తెలిమబ్బు వలువలనే తేలుచుండె
చిరుగాలి లల వీచి చివురాకు మెలుపుగా
హరువులల్లుకు పోయి ఆడుచుండె
తీయని భావాలు తీగలల్లుకు పోయి
పచ్చాకు బంగారు వనె్న తిరిగె
ఊహతో యూహలవి యెన్నొ పోహళించి
సొగసు సంపాదనము చేయుచున్న దదియె
లోకమునకెల్ల క్షీరాభిషేకమొసంగి
పరిధి శారద ఋతుపయ్యె పాలవెల్లి...

మంచు దుప్పటి కప్పి మర్యాద పాటించి
కౌగిలింతల తూర్పు కన్నుతెరచె
జిగిలి కమ్మిన వెల్గు చికిలింత మిసిమిని
గుమ్మడిపూవులో గుస్తరించె
సంజ సానువు జేరి చలిచాయ అటువాలి
కోరిక ముడివిప్పు కొమరుజక్షి
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404