Others

దామోదరలీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణలీలలను రోజు స్మరించుకోవడం ఆనందించటం కృష్ణ భక్తులకు సహజం. అందులో ఉలూఖ ల బంధనం గూర్చి ఎన్నో అంతర్లీనమైన విషయాలున్నాయని అంటారు. రోజు స్మరిస్తూ ఉంటే ఆ అంతర్లీనంగా భగవంతుడు చెప్పదల్చుకున్న విషయాలు ఎవరికి వారు తెలుసుకొంటారు అనీ అంటుంటారు. అటువంటి లీలల్లో దామోదరలీలొకటి.
అల్లరి చేసే కృష్ణయ్య ఒకరోజు మరింత అల్లరి చేస్తున్నాడు.వాని అల్లరి మాన్పడానికి యశోదమ్మ తనఒళ్లో పడుకోబెట్టుకుని పాలివ్వసాగింది. అంతకుముందే గోపభామలందరూ యశోదమ్మ దగ్గరకు వచ్చి మీపిల్లవాని అల్లరిని భరించలేక పోతున్నామని ఫిర్యాదులు చేశారు. వారికి ఏదో ఒకటి చెప్పి పంపించేసింది. వారంతా అందరిండ్లల్లోకి పెరుగు, వెన్న తింటున్నాడు అంటే తనకు చాలా అవమానం వేసింది. మనింట్లో ఇంత పాడి ఉంది పైగా నేను ‘‘ తినరా తిను తిను’’ అని ఎంతో గారాబంగా పిలిచి పెట్టినా తిననివాడు పొరుగిండ్లల్లో తినడమేమిటాఅని అనుకొంది.
తన ఒళ్లో పడుకొని పాలు తాగుతున్న చిన్నవాడిని చూసి ఏమీ అనలేక అనకుండా ఉండలేక ఆలోచిస్తున్న యశోదమ్మకు పాలు దాలిమీద పెట్టిన సంగతి గుర్తు వచ్చింది. అంతే నిద్రలోకి జారుకోబోతున్న చిన్ని కృష్ణయ్యను మెల్లగా కింద దిగవిడిచి ఒక్క పరుగుతో వంటింట్లోకి వెళ్లింది. అంతే నేలపై పడుకోబెట్టిన చిన్నివాడు పెద్దపెట్టున రాగం లంకించుకున్నాడు. అంతేకాదు తనకు దగ్గరలో దొరికిన చిన్న కర్రముక్కను తీసుకొని గురిపెట్టి వెన్నతీస్తూతీస్తూ మధ్యలో వదిలిపెట్టి వచ్చిన కుండను కొట్టాడు. అది చిల్లు పడి ఇల్లంతా పెరుగు పారింది. పైగా కాళ్లు విదిలిస్తూ వచ్చి పక్కనున్న కుండలనుకూడా కాళ్లతో తన్నివేశాడు. దాంతో ఇల్లంతా పాలు, పెరుగు నిండిపోయింది. వంటింట్లో నుంచి వచ్చిన యశోదమ్మకు ఇల్లు పాలసముద్రంగా కనిపించింది.
‘అయ్యో అయ్యో ఎంత పని చేశావురా’ అంటూ పట్టుకోబోయింది. కాని చిన్నవాడుచిక్కుతాడా.. ఇల్లంతా అమ్మను ఏడుస్తూనే పరుగెత్తించాడు. భయపడుతున్నట్లే భయం నటిస్తూనే కళ్లు నులుముకుంటూనే పరుగు మాత్రం ఆపడంలేదు. యశోదమ్మకు ఆయాసం వచ్చింది. ఇలా కాదు వీడ్ని పట్టుకుని తాడుతో కట్టివేస్తే సరిపోతుంది. అప్పుడు కానీ బుద్ధిరాదు అనుకొంది. ఉండు నీ పని చెప్తా కట్టేస్తా అపుడు తిక్క కుదుర్ది అంటూనే తాడు కోసం వెతికి తీసుకొని వచ్చి కృష్ణుడి పట్టుకోవడాని మళ్లీ పరుగు లంకించుకుంది.
కృష్ణయ్య అమ్మ అలుపును చూశాడు. కొప్పు వీడిపోయి, చీరజారిపోయి నా పట్టించుకోకుండా తనచుట్టే పరుగెత్తి తన ధ్యాసతోనే ఉన్న అమ్మను చూసి చాలా జాలిపడ్డాడు. ‘అయ్యో అమ్మా! ఎంత పిచ్చిదానవుతల్లీనీవు? యోగులకే చిక్కనని అందరూ అంటారు కదా తల్లీ నీకావిషయం తెలీదా! అయినా అమ్మా నువ్వు వేరు నేను వేరునా? తల్లీ నీవే కదా నన్ను నీకుమారునిగా కోరుకున్నావు ఇప్పుడు ఇంత అలసిపోతావే. నీవు అలసిపోతుంటే నీమోముపై చిరుచెమటలు చిందుతుంటే నేను చూడగలనా?’ అనుకొన్నాడు. వెంటనే తన తల్లి చేతికి అంటే భక్తి చేతిలో ఒదిగిపోయాడు భగవంతుడు. వెంటనే యశోదమ్మకు ఎంతో ఆనందంవేసింది. ‘చూశావా నిన్ను పట్టుకున్నాను’అనుకొంది. 3ఇపుడు చెబుతా నీపని 1అంటూ తాడు తోకట్టబోయింది. నాకు చిక్కకుండా ఎక్కడికి వెళ్తావురా అంటూ చివాట్లు వేసింది. నేను తల్లినన్న మమకారం కమ్మింది. తానే శ్రమకోర్చి పట్టుపట్టాను అనుకొంది. అంతే భగవంతుడు అమ్మలోని అజ్ఞానపు అహంకారాన్ని చూశాడు. చేతిలో ఉన్న దారం కృష్ణయ్య బొజ్జకు సరిపడలేదు. మరింత దారం తెచ్చింది. ఆ దారం ఈదారం కలిపి ముడివేసి మళ్లీ బొజ్జ చుట్టూ తిప్పింది. విచిత్రం ఇపుడూ రెండు అంగుళాలు తక్కువ ఉంది. ఇలా ఎన్ని దారాలు చుట్టినా బొజ్జకు మాత్రం సరిపోవడం లేదు. ఆ బొజ్జ అంటే ఏమనుకొన్నారు. అది 14 భువనభాండాలను దాచుకొన్న చిన్ని బొజ్జ కదా.అందులోను విష్ణుమాయ కమ్మిన వారు బొజ్జను తన చేతిలోదారంతో కట్టేద్దామంటే చిక్కుతుందా. యశోదమ్మకూ అందలేదు. ఎంత చేసినా సరిపోవడం లేదని నొచ్చుకుంటూనే 3‘అయ్యో భగవంతుడా! ఇదేమి వింత! ఇంత చిన్నివాడు, చిరుబొజ్జ ఇంట్లో దారంఅంతా చేర్చాను. పశువుల చావిట్లో ఉన్న పలుపుదారాన్ని చేర్చాను అయినా చాలట్లేదు. ఓరి నాయనోయ్ భగవంతుడా ఇప్పుడేమి దారి?’ 2అంటూ ఒక చేతిలో కృష్ణయ్య పట్టుకొని మరో చేతితో నెత్తి కొట్టుకుంటూ స్తంభం ఆనుకొని కూలబడింది.
భగవంతుడికి భక్తులపైన ఎంతో వాత్సల్యం కదా. అందుకే ఏడుస్తూనే 34‘అమ్మా నీమాట ఇక ఎప్పుడూ వింటానే.. నన్ను వదిలిపెట్టు అమ్మా. ఇక నీమాట కాదనను. నేను అల్లరి చేయను అమ్మా అమ్మా!’2అంటూ మురిపాలు పోయాడు చిచ్చరపిడుగు. కాస్త అలుపు తీరింది. భగవంతుడికీ ఆమెపై కరుణ కలిగింది. అట్లా కాదులే నీ సంగతి నాకు బాగా తెలుసుఅంటూ మళ్లీ తాడు బిగించింది. గట్టిగా బిగించింది. ఆ గట్టితనానికి కృష్ణయ్య బొజ్జపైన నల్లని మచ్చఏర్పడింది. ఏమచ్చాలేని పరమాత్మ భక్తుల కోసం మచ్చగలవాడయ్యాడు. కనుకనే దామోదరుడు అని కీర్తించారు భక్తులంతా. భక్తి,తగ్గినా తిరిగి తన భక్తుల్లో వాటిని పెరిగేట్లుగా చేసేది భగవంతుడే. అజ్ఞానాంధకారం, అహం కారం పెరిగినా దాన్ని తుంచివేసేదీ భగవంతుడే. అందుకే యశోదమ్మ కట్టబోయన దారంఇపుడు కృష్ణుని బొజ్జ తిరిగి వచ్చింది. గట్టిగా ముడివేసి ఆ చిన్నివాడ్ని లాక్కెళ్లి పెరటిలోని రోలుకు యశోదమ్మ కట్టివేసంది.4 ఇదిగో ఇక్కడే ఉండు. ఎవరింటికైనా ఇక ఎవరింటికైనా ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఇక ఒక్కరంటే ఒక్కరు వచ్చి నీపై నాకు సాడీలు చెప్పొద్దు. ఇల్లంతా గుల్ల చేశావు. నానా చాకిరి చేయాలిప్పుడు ఇక్కడే ఉండు నీసంగతి తేలుస్తా2అంటూ విసవిసలాడుతూ యశోదమ్మ ఇంట్లోకి వెళ్లింది.
ఏమీ చేసినా ఏది చేసినా అంతా భక్తుల రక్షణార్థమే కదా అందుకే భగవంతుడు మెల్లగా రోటిని లాగుతూ వెళ్లి శాపానుగ్రస్తులైన నలకూబర మణిగ్రీవుల దగ్గరకు వెళ్లాడు. వారికి శాపవిమోచనం చేశాడు. శరణాగతి కోరుకుని వెళ్లిపోయారు. పెద్ద శబ్దంతో చెట్లు విరిగి పడడం ఆయమ్మా ఈయమ్మ చూశారు. పరుగు పరుగునవచ్చారు. అంతలో ఆ శబ్దం ఇంట్లో పనిచేసుకొంటున్న యశోదమ్మకు వినిపించింది. తన కొడుకేమైపోయాడో అనుకొంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది.
కృష్ణుడు రోటిని పడవేసుకొని పాక్కుంటూ వస్తున్న తన చిన్ని ముద్దులకొడుకు చూసింది. అయ్యో ఎంత పాపిష్టిదానిని, ఎంత కష్టపెట్టాను నాకొడుకు ను2అని తనని తాను తిట్టుకుని పరుగెత్తుకుని వెళ్లి తన చేతుల్లోకి తీసుకొని తన హృదయానికి హత్తుకుంది. ఇదికదా భక్తి.
నేను చేయవలసిన పని చేసేశాను అనుకున్నాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఇలా ఎన్నో అంతరార్థాలను తన లీలల్లో నిక్షిప్తం చేసిన కృష్ణయ్యను తలుచుకుంటూ ఆ లీలలను స్మరించుకుంటూ ఉంటే ఒకనాటికి జన్మలేని కృష్ణసాయుజ్యాన్ని పొంది తీరుతారు.

- ఆర్. పురందర్