Others
ముదిగొండకు ‘చిలకమర్తి’ పురస్కారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగులో మొట్టమొదటి చారిత్రక నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులగారు వారి 152వ జయంతి ఉత్సవాలు హైదరాబాదు త్యాగరాయ గానసభలో 26 సెప్టెంబరు గురువారం సాయంత్రం జరుగుతాయ. ఆ సందర్భంగా చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌కు చిలకమర్తి సాహితీ పురస్కారం అందజేయనున్నట్లు కినె్నర ఆర్ట్ థియేటర్స్ ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇది చిలకమర్తి మల్లయ్యశాస్ర్తీ శత జయంతి కావటం కూడా విశేషం. ఈ సభలో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె.వి.రమణ, దూరదర్శన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఓలేటి పార్వతీశం, చిలకమర్తిపై పరిశోధన చేసిన డాక్టర్ ముక్తేవి భారతి, చిలకమర్తి వంశీయురాలు డాక్టర్ పి.మాణిక్యాంబ, త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి ప్రభృతులు పాల్గొంటారు. జొన్నాభట్ల లక్ష్మీకామేశ్వరి దేశభక్తి గీతాలాపన చేస్తారు. ముదిగొండ శివప్రసాద్ ఇప్పటికీ 108 రచనలు చేశారు. చారిత్రక నవలా ప్రపంచంలో విశ్వనాథ, నోరి, బాపిరాజు తర్వాత వీరు సుప్రసిద్ధులు. వివరాలకు మద్దాళి రఘురామ్, ఫోన్: 040-27425668ను సంప్రదించగలరు.
*చిత్రాలు.. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు
*చిలకమర్తి మల్లయ్య శాస్ర్తీ
*ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్