Others

ప్రజారోగ్యం పగటికలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యం అందించాలని జాతీయ ఆరోగ్య విధానాన్ని 2017లో కేంద్రం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సంపూర్ణ ఆరోగ్య ఫలాలను అందించడమే ఈ విధానం లక్ష్యం. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అత్యాధునిక వైద్య సేవలందించడమే జాతీయ ఆరోగ్య విధానం సంకల్పం. ఈ విధానం మేరకు వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవడంతో పాటు అంటురోగాలు ప్రబలకుండా కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. ఉచిత వైద్యసేవలు, మందులు, పరీక్షలు, అత్యవసర చికిత్సలకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ప్రణాళికాబద్ధంగా అమలు చేసినపుడే ఈ విధానం రోగులకు చేరువవుతుంది.
ఏటా మన దేశంలో ప్రజలు తమ ఆరోగ్యం కోసం సంపాదనలో 67 శాతం వెచ్చించడం బాధాకరమైన విషయం. ఆరోగ్య బీమా ద్వారా వైద్య ఖర్చులను పూడ్చుకొనే వెసులుబాటు ఉన్నా, నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 86 శాతం, పట్టణ ప్రాంతాల్లో 82 శాతం ప్రజలకు బీమా లేకపోవడం దారుణం. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా ప్రభుత్వాలు వైద్యానికి ప్రజలు వెచ్చించిన సొమ్మును తిరిగి చెల్లిస్తున్నాయి. అధిక జనాభా, రోగుల సంఖ్యను ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని బీమా పథకాలకు ప్రభుత్వాలు ప్రోత్సాహమివ్వాలి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులు, పరికరాలను ఇప్పటికీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగానే అలాంటి ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, రాయతీ ధరలకు అందజేయడం వల్ల రోగులకు వెసులుబాటు కలుగుతుంది. భారతీయ వైద్యంలో అనాదిగా ఉన్న ఆయుర్వేదం, యోగ, న్యాచురోపతి, యునానీ వంటి సాంప్రదాయ వైద్యవిధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే రోగులకు మరింత మేలు జరుగుతుంది. 188 దేశాలకు సంబంధించిన మానవాభివృద్ధి సూచీలో భారత్ స్థానం 130 నుంచి 131కి దిగజారింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రేటులో భారత్ దూసుకెళుతున్నా మానవాభివృద్ధి సూచికలో వెనుకబడడం గమనార్హం. ప్రస్తుతం జీడీపీలో 1.15 శాతం నిధులు మాత్రమే ఆరోగ్యరంగానికి కేటాయిస్తుండగా జాతీయ వైద్య విధానం దీన్ని 2.5 శాతానికి పెంచాలంటోంది. మరో విచిత్ర పరిణామమేమిటంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కేటాయించిన కొద్దిపాటి నిధులను కూడా వెచ్చించకుండా వాపసు ఇచ్చేస్తున్నాయి. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకల ప్రజారోగ్య రంగంలో తక్కువ నిధులతోనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఇతర దేశాల అనుభవాల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్థిక సరళీకరణ విధానాలతో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా విస్తరించినా అవి లాభసాటి ప్రాంతాల్లో ఉండడం వల్ల గ్రామీణ ప్రజలకు ఆశించిన వైద్యసేవలు అందడంలేదు. పౌరులందరికీ ప్రాథమిక వైద్య సౌకర్యాలను ఆయుష్ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి అన్ని ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు అందజేయాలి. జాతీయ పట్టణ ఆరోగ్య పథకాన్ని ప్రణాళికాబద్ధంగా అమలుచేయాల్సిన అగత్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

-దాసరి కృష్ణారెడ్డి 98853 26493