Others

శ్రీచక్రము, మానవ శరీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
===================================================================
స్వాధిష్ఠాన చక్రం ( సర్వశా పరిపూరక చక్రము)

శ్లో॥ స్వాధిష్ఠానాఖ్య పద్మే రసదళలసితే వేద వక్త్రాం త్రినేత్రాం
హస్త్భ్యాం ధారయంతీం, త్రిశఖగుణ, కపాలా భయాన్యాక్త గర్వాం
మేదోధాతు ప్రవ్ఠిఃమళి, మద ముదితాం బందినీ మఖ్య యుక్తాం
పీతాం దధ్యోదనే ష్ఠామభిమత ఫలదాం కాకినీం భావయామః

శ్లో॥ స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా
శూలాధ్యాయుధ సంపన్న పీత వర్ణాది గర్వితా ॥ (ల.స.స్తో.104)
శ్లో॥ మేదోనిష్ఠా మధుప్రీతా బంధిన్యాది సమన్వితా
దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ॥ (ల.స.స్తో.105)
3‘బ’ 2 నుండి 3‘లా’ 2 వరకు గల ఆరు వర్ణములతోను, ఆరుదళములతోను ప్రకాశిస్తున్న అగ్నితత్త్వం కలది. ఇచట ఉదరాది సంతర్తాగ్ని లింగస్థానమున కలది. 3‘వం’ 2 బీజముగా గలది.4‘కాకినీదేవి’ ఆధిపత్యం గలది అగు స్వాధిష్ఠాన చక్రమును హృదయమందు ధరిస్తున్నాను అని ప్రార్థించాలి. శ్రీచక్రార్చనలో ఈ చక్రానికి భోగపాత్ర ప్రతీక.
స్వాధిష్ఠాన చక్రం ఆరుదళములలో బీజాక్షరాలు వరుసగా బ, భ, మ, య, ర, ల అనునవి ఉంటాయి. గర్భస్తశిశువుకు, నాల్గవ మాసములో పొట్ట నడుము ఏర్పడుతాయి. ప్లీహము పూర్తిగా స్వాధిష్ఠాన చక్రాధీనమై ఉండును. శరీరంలోని శీతోష్ణాలను ఈ చక్రం నియంత్రిస్తుంది. ఆరుదళాలు కల ఈ చక్రాధిష్ఠ్ఠాన దేవతను ‘సిద్ధేశ్వరిదేవి’ గా వ్యవహరిస్తారు. ఈ దేవత బంగారు వర్ణం కలిగి, నాలుగు భుజాలు కలిగి మూడు కన్నులు కలిగి, చేతులలో పాశము, కపాలము, అభయముద్ర ధరించినది. కాకినీ శక్తిరూపంలో ఉండి, సప్త్థాతువులలోని, మేధో ధాతువునకు (మెదడుకు)అధిధేవతగా ఉంటుంది. ఈ చక్ర వ్యాహృతి 3‘‘ఓం భువః’’ 2 స్వాధిష్ఠాన చక్రము మూలాధారమునకు రెండంగుళముల పైన జననేంద్రియము మొదలు వెనె్నముక చివరి పూస వద్ద ఉంటుంది. ఇచ్చటి కుండలినీ శక్తి పేరు4‘‘త్రిపురేశి’’ఈచక్రంలో ఆరువందల నాడులు ఉంటాయి. ఒకసారి శ్వాస పీల్చి వదిలేలొగా ఈ నాడులు ఆరువందల సార్లు స్పందిస్తాయి. ఈ చక్రము మూత్ర పిండములు, జననావయవ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంది. ఈ చక్రం ఉత్తేజితమైతే కామక్రోధాది గుణములను సాధకుడు జయించగలడు. అంతేకాక పూర్వజన్మలు వాటి అనుభవములు కర్మబంధములుగా ఈ చక్రమందు నిక్షిప్తమై ఉంటాయి. ఇది తర్కవితర్క ములకు అందని గొప్ప శక్తి. దీనికి రూపం లేకున్నను ఈ గొప్పశక్తి. స్వాధిష్ఠాన చక్రము ఉత్తేజితమైనపుడు అనగా మేల్కొలిపినపుడు కర్మశేషములన్నియు నశించి, దుష్కర్మలు బహిష్కరించబడుతాయి. స్వాధిష్ఠానమనగా స్వంత నివాస స్థానమని చెబుతారు. దీనియందు అష్టదళ పద్మాకారంలో జలమండల ముంటుంది. దీని మధ్యలో అర్థచంద్ర చిహ్నం కలిగి ఉంటుంది. ఇది అమృత స్రావము కలిగి ఉంటుంది. కావున ఈ చక్రమందు వరుణ బీజనమైన 3‘వం’ 2 ప్రకాశిస్తుంది. ఈ 3‘వం’ 2 బీజంలోని బిందువునందు బ్రహ్మ సర్వశోభితుడై ప్రకాశిస్తున్నాడు. సింధూర వర్ణంతో 3‘కాకిని’ 2 శక్తి ఈ చక్రమందు అధిష్ఠాత్రిగా ఉన్నది. ఈ చక్రానికి అదిష్ఠాన దేవుడు బ్రహ్మయని శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మచేసే పని సృష్టికార్యం కనుక సరిగా అన్వయమైంది.
ఈ చక్రమందు షడ్దళములపై వరుసగా ఆరుశక్తులదిష్టించి ఉన్నవి. (అ)1. బందిని (బ)2. భద్రకాళి. (్భ)3. మహామాయ (మ)4. యశశ్వని(య) 5. రమా (ర) 6. లంబోష్ఠ్ఠి(ల) ఈ శక్తుల మధ్యలో 3‘కాకిని’ 2 దేవత ఉంటుంది. ఈమెను 3‘‘సిద్దేశ్వరి’’ 2 అంటారు. సిద్దగణాలచేత సేవించబడుతుంది. కాశీక్షేత్రమందీ దేవత సర్వసిద్ధులను ప్రసాదించు ‘‘సిద్దేశ్వరిగా’ ’ వెలసి యున్నది. ఈదేవతకు మధువు(తేనె)పెరుగుతో కలసిన అన్నం ప్రీతిదాయకం. మధువు (తేనె)మేధోవృద్ధికరమని చెప్తారు. సిద్దేశ్వరి దేవికి న్యాసము బీజము, మంత్రము అన్నీ4క2కార సంకేతముగా నుండుట ఈమెను 3‘‘కాకిన్యాంబా’’ 2అని అంటారు. పరమేశ్వరిని 3‘‘మధుప్రీతా’ ’ 2అని కీర్తిస్తారు. మధు విద్య గురించి ఛాందోగ్యోపనిషత్తు ఇట్లు చెబుతున్నది.సూర్యకిరణాలచే బ్రహ్మండమంతా మధు రసం స్రవించుచున్నది. అది ఎట్లనగా సూర్యకిరణ ప్రసరణ వల్లనే పరమేశ్వరి అంశఅయన భూమిపై తరులతాది వృక్షజాతి కిరణజన్యసంయోగ క్రియచే యెదుగుదలచెంది పుష్పించు చున్నందువల్ల తేనె ఉత్పత్తి అవుతున్నది

ఇంకా ఉంది