Others

ఏది కర్తవ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమమైన నాగరికతతో , అమూల్యమైన భావాలతో మన జీవ నౌక కోటానుకోట్ల జీవుల నెక్కించుకుని యుగయుగాలుగా పయనిస్తోంది జీవన మనే సముద్రంలో. కొన్ని లోపాల వల్ల నౌకకు చిన్న చిన్న చిల్లులు పడ్డాయి. అపుడు అందులో ప్రయాణిస్తున్న వాళ్లు ఏం చేయాలి? అటు ఇటూ పరుగులెత్తకుండా ఆ నౌకకు బాగుచేసుకోవాలి.
ఆ పరిస్థితుల్లో ఆ నౌకలోని వారికి కావల్సింది విశ్వాసం. తన పై తనకు నమ్మకం. అదే ఆత్మ విశ్వాసం. కుల,మత వర్గాది భేదాలు లేకుండా జనసామాన్యాన్ని ఉద్ధరించడమే ఆదర్శం. కృషి చేయడం ప్రతివారి కర్తవ్యం. ‘కృషి చెయ్యడమే తనవంతు’ ఫలితం దానంతట అదే వస్తుంది. ఎందుకంటే గీతాచార్యుడు ‘నీ కర్తవ్యాన్ని నీవు చేయి. ఏ ఫలితాన్ని ఎప్పుడు నీకివ్వాలో దాన్ని నేను ఇస్తాను నీ యోగక్షేమాలు నన్ను నమ్మితే నేను చూస్తాను’ అని చెప్పాడు కదా. అందువల్ల ప్రతివారు వారి వారి కర్తవ్యాలను చేస్తే సరిపోతుంది. ఫలితాలు వాటంతట అవే వచ్చేతీరుతాయి. దేశం ఏమిచ్చింది అంటూ పదే పదే ఉపన్యాసాలు ఇచ్చినా లాభం ఉండదు. దేశం గురించి ఇది చేయాలి.అది చేయాలి. దేశప్రజలంతా కలిసి ఉండాలి. దేశప్రజలంతా జాతీయ ఆదాయాన్ని పెంచాలి అంటూ గొప్ప ఉపన్యాసం ఇచ్చినా పెద్ద లాభం ఏమీ ఉండదు.
అదీకాకపోతే మావారు అంటే మా పూర్వీకులు దేశానికి ఇంత సేవచేశారు. దేశానికి వాళ్లే వెనె్నముకగా నిలబడ్డారు అని ఉర్రూత లూగినా దేశానికి వచ్చే ప్రయోజనం ఏదీ ఉండదు.
అందుకే ‘నేను ఏమిచేస్తున్నాను? నాకోసం ఏమి చేశాను. నా చుట్టూర ఉండేవారికోసం నేను ఏమంచిపని చేస్తున్నాను’అని ఎవరికి వారు ప్రశ్నించుకుని చుట్టూత ఉన్నవారిలో అవసరం ఉన్నవారికి కాస్తంత చేయి చాచి సహాయం అందిస్తే చాలు దేశానికి సేవ చేసినట్లే అవుతుంది.
ఇల్లు చక్కదిద్దుకుని దేశానికి సేవ చేయమన్నారు పెద్దలు. అంటే కుటుంబంలోని వ్యక్తులంతా కలిసి మెలిసి ఉంటూ వారి జీవించడానికి కృషి చేస్తూ ఆ కృషిఫలితంలో కాస్త అవసరమైన వారికి అందిస్తే అదే దేశ సేవ అవుతుంది.
ఈ సేవ లేక సహాయం చేయడానికి ఎట్టి ఉపన్యాసమూ అక్కర్లేదు. భాజాభజంత్రీలు అక్కరకురావు. కేవలం పని చేయడమే. అందుకే ప్రార్థించే పెదవులకన్నా చేసే పని చేసే చేతులే మిన్న అన్నారు మన పెద్దలు. పది ఉపన్యాసాలు చేసే మేలు కన్నా రెండు పనులు చేసే మేలు పదింతలు మేలన్నారు.
పనినే భగవంతుడుగా భావించాలి. చేసే పనిలో అవినీతి, అన్యాయం, అక్రమం లాంటి దురాగతాలు లేకుండా పనిని శాస్ర్తియంగా నీతి నిజాయితీలతో చేస్తే చాలు ఆ పని ఫలితం వందరెట్లు పదిమందికి చేరుతుంది. మనకున్న దానిలో కాస్త పక్కన వారికి పెట్టాలి. ఈర్ష్యాసూయలు దూరం చేసుకోవాలి. మంచితనానే్న మనసునిండా నింపుకోవాలి. సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అనడంలోని మర్మం కూడా ఇదే. కాస్త మనం మనకోసం చేసే పనిలో పొరుగువారికి తోడుగా నిలిస్తే చాలు అది వారి జీవితాన్ని నిలబడెతుంది.
దీనికి అందరూ విద్యావంతులు కావాలి. విద్యావంతులు అంటే కేవలం శాస్త్ర విషయాల పైన పట్టు కాదు. మనిషిని సంస్కరించి శీలవంతునిగా నిలబెట్టే చదువు ప్రతి మనిషి చదువుకోవాలి. అపుడే అతనిలో నీతి నిజాయతీలు నిర్మించబడుతాయ. అపుడు అక్రమ మార్గంలో పయనించాలన్న దురాశ ఏర్పడదు. పక్కవానిని కొట్టి అయనా వానిది కూడా లాక్కొని తినాలన్న బుద్ధి నశిస్తుంది. జంతువులుకూడా కేవలం వాటి ఆకలి తీర్చుకోవడానికే వేటాడి ఇతర జంతువులను తింటాయట. లేక వృక్షజాతు లను పెరికి వేస్తాయ. వాటి ఆకలి తీరిన తర్వాత వాటి ముందు నుంచి వాటితో వైరం ఉన్న జంతు వులు తిరుగుతున్నా వాటిజోలికి వెళ్లవట.
కానీ మనిషి మాత్రం తన ఆకలి తీర్చుకోవడమేకాక తన వారసులకోసం తరతరాలకు తరగని ఆస్తిని కూడబెట్టే నెపంతో ఎన్నో అకృత్యాలకు ఒడిగడుతున్నాడు. కనుక ఇట్లాంటివి చేయకుండా మనిషి అంటే మంచితనం, మానవత్వంకలిగి ఉండాలని అని చెప్పడానికే భగవంతుడైన శ్రీకృష్ణుడు పుట్టినప్పటినుంచి చూపించిన లీలల్లో ఎనె్నన్నో విషయాలు చేసి చూపాడు. రాముడు కేవలం మంచి ఏదో చేసి చూపితే కృష్ణుడు మంచి చేస్తూనే ఇలా చేయండి మీకు నేను తోడుంటాను అని కూడా చెప్పాడు. అందుకే రాముడినైనా, కృష్ణుడినైనా ఆదర్శంగా తీసుకున్నా వారుచేసి చూపిన పనుల్లో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకొని మనం బతకడమే కాక పక్కవారినికూడా వారు బతకడంలో సాయం అందించాలి.
అపుడే మనం ప్రయాణించే జీవనౌకకు పడిన చిల్లులకు మరమత్తులు జరిగి తిరిగి జీవనౌక జీవనమనే సముద్రంలో అడ్డంకులు లేకుండా ప్రయాణించి చివరకు తీరం చేరుతుంది.

-రేవతి