Others

‘ధరణి’పై మోదీ ముద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం.. అమెరికాలోని హ్యూస్టన్ నగరం.. తెలుగువారితో పాటు సుమారు 50వేల మందికి పైగా ప్రవాస భారతీయుల నోట మార్మోగిన ‘హౌడీ మోడీ’ నినాదం. ఉత్తేజ పూరిత మానవ హారం.. మహాద్భుత సన్నివేశం.. ప్రపంచం ముందు పెరిగిన భారత్ బలం.. వీగిన విష ప్రచారం.. అంతిమంగా ఇదొక కొత్త అధ్యాయం..
అగ్రరాజ్యమైన అమెరికా భారత ప్రజలను- వారి ప్రజ్ఞను ఆలింగనం చేసుకుంది. అవసరమైనప్పుడు తోడు-నీడగా ఉంటామని చెప్పింది. మునె్నన్నడూ లేనంత దగ్గరగా జరిగింది. ‘జయహో భారత్’ అని వేనోళ్ళ కీర్తించింది. కొత్త చరిత్రను లిఖించింది. సంయుక్తంగా సవాళ్ళను ఎదుర్కొంటామన్న సంకేతం ఇచ్చింది. ‘సరిగమల’ సరసన డ్రమ్ బీట్స్ వినిపించాయి. అటు సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇది సరికొత్త సంయోగం (్ఫ్యజన్).
‘‘్భరత విలువలు- సంస్కృతి.. అమెరికా విలువలతో కలిసిపోతాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బలోపేతమయ్యాయి’’.. అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎన్‌ఆర్‌జీ స్టేడియం సాక్షిగా ప్రకటించారంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ పెట్టుబడులను భారత్ అమెరికాలో పెడుతోంది. అమెరికాలో తయారైన అత్యుత్తమ వస్తువులు భారత్‌లో పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఇదీ కూడా ట్రంప్ నోట వెలువడిన మాటనే!
సరిహద్దు భద్రత ఇరుదేశాలకూ ప్రాధాన్య అంశం.. భారత సరిహద్దు భద్రత అంశంలో అమెరికా పూర్తిగా సహకరిస్తుంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి అమాయక పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో తోడుంటాం.. మరిన్ని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటాం...’’అని ట్రంప్ హామీ ఇవ్వడం కోటి ఏనుగుల బలంతో సమానం. దీంతో రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత పటిష్టమై ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు, బోస్టన్ నుంచి బెంగళూరు వరకు, షికాగో నుంచి సిమ్లావరకు ఈ స్నేహ బంధం... ప్రేమబంధం... ఆత్మీయ అనుబంధం పెనవేసుకుందని ప్రధా ని మోదీ అన్నప్పుడు స్టేడియంలోని ప్రవాస భారతీయుల గుండె చప్పుడు తారస్థాయికి చేరుకుంది. ప్రసార మాధ్యమాల్లో ఈ కార్యక్రమాన్ని తిలకించిన కోట్లాది మంది ప్రజల హృదయాలు ఉత్తేజితమయ్యాయి.
‘హౌడీ మోడీ’ కార్యక్రమానికి ట్యాగ్‌లైన్‌గా ‘ఉమ్మడి స్వప్నాలు- ఉజ్వల భవిష్యత్’ అని పెట్టడంతో రెండు దేశాల ఆకాంక్షలు అక్కడ ప్రతిఫలించాయి. ప్రపంచం తనవైపు చూసేలా చేశాయి. ఆశించిన దానికన్నా ఎక్కువే ‘హౌడీ మోడీ’ ప్రభావం చూపింది. సకారాత్మక ధోరణికి ‘్ధరణి’పై ఎంతటి ‘మాన్యత’ ఉంటుందో చూపింది. ‘నకారాత్మక’్ధరణిలో అడుగులు వేస్తున్న పొరుగు దేశానికి కళ్లు బైర్లుకమ్మాయి. కలహాలతో కాలం వెళ్ళబుచ్చే ‘సందర్భం’ ఇదికాదని గట్టిగా తెలిసొచ్చింది.
ఏవోబీలో ఎన్‌కౌంటర్..
భారత ప్రతిష్ట-పలుకుబడి, ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రపంచ సేవకుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవించి ఆలింగనం చేసుకోగా, వర్తమానంలో గొప్ప ప్రభావశీలి నాయకుడిగా ఐక్యరాజ్యసమితి సైతం గుర్తిస్తుండగా భారతదేశంలో మావోయిస్టులు మోదీ సర్కార్‌ను సాయుధ పద్ధతిలో కూల్చివేసి, కార్మిక-కర్షక నియంతృత్వ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీని హత్యచేసేందుకు ‘కుట్ర’ పన్నినట్టు గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా హ్యూస్టన్‌లో ‘హౌడీ మోడీ’ కార్యక్రమం జరిగిన రోజున ఇక్కడ విశాఖ మన్యంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రత్యేక జోనల్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ మన్యంలోని గూడెం కొత్తవీధి మండలంలోని మడిగమల్లు- కొండజార్త అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురు మావోలు మృతి చెందారు. సంఘటన స్థలంలో సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్), రెండు త్రీనాట్ త్రీ తుపాకులు, మందుపాతర, ఇతర ఆయుధ సామాగ్రి, కిట్లు లభ్యమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.
గత సంవత్సరం ఇదే నెలలో విశాఖ మన్యంలో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోలు నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపారు. డుంబ్రిగూడ ప్రాంతంలో చాలాకాలం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెలలోనూ ఏవోబీలో కాల్పులు జరిగాయి. కాని అప్పుడు ఎవరూ మరణించలేదు. ఆనాటి నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలిస్తూనే ఉన్నాయని తెలుస్తోంది. ఫలితంగా తాజా ఎన్‌కౌంటర్ అని భావిస్తున్నారు.
అటు హ్యూస్టన్... ఇటు ఏవోబీ రెండు వేర్వేరు ‘ప్రపంచాలు’. హ్యూస్టన్ చుట్టూ ప్రపంచం ర్యాలీ అవుతున్న ‘దృశ్యం’ స్పష్టంగా కనిపిస్తోంది. ఏవోబీలో సాయుధ పోరాటం చేస్తామని తిరుగుతున్న మావోయిస్టుల చుట్టూ ఎవరు ‘ర్యాలీ’ అవుతున్నారు? సహజంగానే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి ‘శూన్యం’ అన్న సమాధానమే వస్తోంది. నరేంద్ర మోదీ చెప్పినట్టు హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు, బోస్టన్ నుంచి బెంగళూరు వరకు, షికాగో నుంచి సిమ్లా వరకు అంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలను ఆశిస్తున్నారు. వౌలిక సదుపాయాల పెరుగుదలను కోరుతున్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వెలుగులో జీవితాలను పండించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తదనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. కాలపరిమితి ముగిసిన ప్రభుత్వాల స్థానే తమకు నచ్చిన ప్రభుత్వాలను గద్దెనెక్కిస్తున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా వారు ‘శాశ్వతం’గా ఉండిపోయే వీలులేదు. ప్రజాస్వామ్యంలోని ఈ ప్రత్యేకతను ప్రపంచమంతా శ్లాఘిస్తోంది. మావోయిస్టులు మాత్రం నియంతృత్వం... నిరంకుశత్వం కావాలని కోరుతున్నారు. ఆ రకమైన వ్యవస్థ ఏర్పాటుకై ఆయుధాలు పట్టారు. ఈ విధానానికి, పద్ధతికి మాన్యత లేదని, మానవాళి ఆ ‘దశ’ను దాటి వచ్చిందని, ప్రజలు నిరంకుశత్వం, నియంతృత్వం గాక ‘సాధికారత’ను కోరుతున్నారని మావోయిస్టులు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు.
ప్రస్తుతం వస్తుత్పత్తి ఏ ‘ఇరుసు’పై జరుగుతున్నదో కూడా అంచనా లేకుండా ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ పేరిట అడవుల్లో సంచరించడం చారిత్రక తప్పిదం తప్ప మరొకటి కాదు. ప్రయోగాలపై ప్రయోగాలు చేయడం.. తప్పిదాలపై తప్పిదాలు చేస్తూపోవడం ఎవరికి శోభస్కరంగా ఉంటుంది? గత 50 ఏళ్ళలో ‘వంశధార’ నదిలో ఎంతో నీరు ప్రవహించి సముద్రంలో కలిసిందన్న స్పృహ మావోయిస్టులకు లేనంత కాలం ఇలా అసువులు బాయటం మినహా ప్రయోజనం ఇసుమంత కనిపించదు. ఏ ప్రయోగానికైనా కొంత కాలపరిమితి ఉంటుంది.. ఉండాలి. మావోయిజం వెలుగులో శ్రీకాకుళ సాయుధ పోరాటం ప్రారంభమై అర్ద శతాబ్దం పూర్తయింది. అయినా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఆ ‘మార్గం’లో ఏమి సాధించారు? ప్రజల జ్ఞాన చక్షువులు ఏ మేరకు విప్పారాయి?... చైతన్యం పెరిగి వారి జీవనప్రమాణాలు ఏమేరకు మెరుగుపడ్డాయి?... అర్ధ శతాబ్ద సమయం తక్కువేమీ కాదు. ఈ విశాల సమయంలో ఫలితం గాని, ప్రభావం గాని చూపని ఆ సిద్ధాంతంతో గిరిజనులను, ఆదివాసీలను, అమాయకులను మరింత వెనక్కి నడిపించడం న్యాయమా?...
బుగతలు- షావుకార్ల కేంద్రంగా ఇప్పటి కాలం కొనసాగడం లేదు, ప్రజలే కేంద్రంగా సాంకేతిక పరిజ్ఞానం ఉబికివస్తోంది. దాన్ని మరింత సాంద్రతతో ప్రజల్లోకి తీసుకెళ్ళడంలోనే విజ్ఞత, విప్లవం దాగున్నది. ఆ వివేకం ప్రదర్శించిన వారిని ప్రజలు ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్న వైనం ‘హ్యూస్టన్’లో స్పష్టంగా కనిపించింది కదా?... మావోల కళ్లు ఇప్పటికైనా తెరుచుకుంటాయా..?

-వుప్పల నరసింహం 99857 81799